జూరాలలో జలవిద్యుత్తుకు ఆటంకం
దిగువ జూరాల హైడల్ ప్లాంట్‌లో విద్యుత్తు ఉత్పత్తికి గ్రహణం పట్టింది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్‌కు అనువైన వనరులున్నప్పటికీ కృష్ణానదిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి జరుగడం లేదు.
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : దిగువ జూరాల హైడల్ ప్లాంట్‌లో విద్యుత్తు ఉత్పత్తికి గ్రహణం పట్టింది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్‌కు అనువైన వనరులున్నప్పటికీ కృష్ణానదిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల పూర్తిస్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి జరుగడం లేదు. ముఖ్యంగా నది గర్భంలోని బండరాళ్లు, రాతిమేటలు, వరదలతో కొట్టుకొచ్చిన ఇసుక, బురద విద్యుత్తు ఉత్పత్తికి అటంకాలు కలిగిస్తున్నాయి. 240 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం 212.8 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. దిగువ జూరాల జలవిద్యుత్తు ప్రాజెక్టులో 40 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన 6 యూనిట్లు ఉన్నాయి. 2016 అక్టోబర్ 1 నాటికే అన్ని యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, 2017 అక్టోబర్ 21న నిర్వహించిన లోడ్ పరీక్షలో అసలు సమస్య బయటపడింది.
ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 279.65 మీటర్ల వద్ద ఉండాల్సిన టెయిల్ వాటర్ లెవెల్ వాస్తవంగా 281.30 మీటర్లకు చేరినట్టు గుర్తించారు. పవర్ హౌస్ నుంచి వెలువడే నీరు టెయిల్ రేస్ చానల్ ద్వారా కృష్ణానదిలో కలుస్తుంది. నీళ్లు కలిసే ప్రాంతంలో నదీ ప్రవాహ మార్గం ఇరుకుగా మారిపోయింది. 70-80 మీటర్ల వెడల్పు ఉండాల్సిన ఈ మార్గం రాతిగుట్టల కారణంగా 40 మీటర్లకు కుంచించుకుపోయింది. ఈ బ్యాక్‌వాటర్ ప్రభావం వల్ల టెయిల్ రేస్ చానల్లో నీటి మట్టం పెరిగి టర్బైన్ల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. టెయిల్ రేస్ చానల్ అడుగు భాగంలో రాతి దిబ్బలు, కృష్ణానది సంగమ ప్రాంతంలో శిలలు, దిగువన నది ఇరుకుగా మారడం, వరదల సమయంలో కొట్టుకొచ్చిన మట్టి, బండరాళ్లు పేరుకుపోవడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతున్నట్టు జెన్కో గుర్తించింది. నదీ ప్రవాహానికి అడ్డంకులు తొలగించలేకపోవడంతో అందుబాటులో ఉన్న యంత్రాల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది.
రూ.12.60 కోట్ల వ్యయంతో పనులు
టెయిల్ రేస్ చానల్లో పేరుకుపోయిన 2లక్షల క్యూబిక్ మీటర్ల రాతి దిబ్బలు, శిలలను తొలగించడం, కృష్ణానది సంగమ ప్రాంతం నుంచి పుషరఘాట్ వరకు నది గర్బం వెడల్పును 88 మీటర్ల వరకు పెంచడం, 2వేల క్యూబిక్ మీటర్ల మట్టి, బండరాళ్లను తొలగించడంపై జెన్కో దృష్టి సారించింది. 2025 సెప్టెంబర్ 23న జరిగిన జెన్కో 73వ బోర్డు సమావేశం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రూ.12.60 కోట్ల అదనపు మూలధన వ్యయంతో పనులు చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులు పూర్తయితే ఏటా 15 నుంచి 24 మిలియన్ యూనిట్ల అదనపు విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఏర్పడుతుందని జెన్కో అంచనా వేసింది. ఇందుకు వెచ్చించే మొత్తం 9.5 నెలల్లోనే రికవరీ అవుతుందని జెన్కో వర్గాలు చెప్తున్నాయి. ఈ పనులు చేపట్టేందుకు ఈఆర్సీ అనుమతి కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

