నారాయణపేట, మార్చి 3 : తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, బడుగు బలహీనవర్గాల ప్రతినిధిగా, గీతా గౌడ కులస్తుల అభిమాన నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకొని, హైదరాబాద్‌కు సమానంగా పాలమూరు పునర్నిర్మాణంలో అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తు న్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం ఘటనను తీ వ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. జిల్లాను ఎంతో అభివృద్ధి చే స్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని, అదే జరిగితే రాజకీయంగా ఎదుర్కోలేమని ఆయ న ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంత మంది కలిసి హత్య కు ప్లాన్ వేశారన్నారు. ఘటనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న వారు ఎంతటి వారైనా వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించడంతో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అంతేకాకుండా తెలంగాణలో ఇలాంటి హత్యా రాజకీయాలకు చోటు లేదని, పోలీసులు మరోసారి తమసత్తా చూపించాలన్నారు. రాజకీయంగా ఎదుగాలనుకునే వారు రాజకీయంగానే ఎదుర్కోవాలే తప్ప ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. పాలమూరు పేదలకు చేసిన మంచి పనులే ఈరోజు సీనన్నను గండం నుంచి తప్పించాయన్నారు. మంచి చేసి పేరు తెచ్చుకొని ప్రజలకు దగ్గరై రా జకీయంగా ఎదుగాలే తప్ప హత్యలు చేయడం, చేయించ డం ద్వారా కాదని తెలియజేశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
నారాయణపేట టౌన్, మార్చి 3 : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యకు కుట్ర పన్నిన నిందితులను కఠినంగా శిక్షించాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ గురువారం ప్రకటనలో తెలిపారు. వెనుకబడిన పాలమూరు జిల్లాను కరువు, వలసల నుంచి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న శ్రీనివాస్‌గౌడ్‌పై కొందరు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని తెలియజేశారు. మంత్రిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట ఉంటుందని పేర్కొన్నారు.
కుట్ర పన్నడం హేయనీయం
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్య చేయడానికి కుట్ర పన్నడం హేయనీయమని, నిందితులను కఠినంగా శిక్షించాలని పీఆర్టీయూ మండల ఉపాధ్యాయ సం ఘం, టీఆర్ఎస్ మండల యూత్ కమిటీ సభ్యులు డిమాం డ్ చేశారు. గురువారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ యూత్ మండల అధ్య క్షుడు జె.రామన్‌గౌడ్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమామే పరమావధిగా నిరంతరం పని చేయడాన్ని కొందరు శక్తులు జీర్ణించుకోలేక మంత్రిని హత్య చేయడానికి కుట్ర పన్నడా న్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలకు పూ నుకొనిన నిందితులను చట్టపరంగా తీవ్రంగా శిక్షించాలని కోరారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పీఆర్టీయూ మండల అధ్యక్షుడు వెంకటేశ్, ప్రధానకార్యదర్శి శివశంకర్ అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల యువ నాయకులు పాల్గొన్నారు.
అరెస్టు చేయాలి
అందరి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేసిన నిందితులను అరెస్టు చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్‌పాటిల్, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షు డు శివప్ప డిమాండ్ చేశారు. గురువా రం మండలకేంద్రంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో వారు మా ట్లాడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేసి న అభివృద్ధ్దిని చూసి జీర్ణించుకోలేక ఇ లాంటి తప్పుడు మార్గాలను ఎంచుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. విషయంపై సమగ్రమైన విచారణ జరిపి సూత్రదారులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీ ఆర్ఎస్ నాయకులు వెంకటేశ్, శివరాజ్‌పాటిల్, మోనేష్, శంకర్‌నాయక్, మహదేవ్, ఆంజనేయులు, దేవేంద్రప్ప త దితరులు పాల్గొన్నారు.
హత్యకుట్రపై ఖండన
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నిన దుండగులను శిక్షించాలని టీఆర్ఎస్ మండల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ధన్వాడ సర్పం చ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు సునీల్‌రెడ్డి, స ర్పంచ్ అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న నాయకుడిపై హత్యకు కుట్ర ప న్నడం దారుణమన్నారు. ఘటనకు కారణమైన దుడంగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశం లో టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్, నా యకులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధిని ఓర్వలేకే కుట్రలు
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జిల్లాలో చే పడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే కుట్రలు చే స్తున్నారని గౌడ సంఘం తాలూకా అధ్యక్షుడు వీరేశ్‌గౌడ్ అన్నారు. గురువారం మండలకేంద్రంలో గౌడ సంఘం ఆ ధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హ త్యకు కుట్ర చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పే ర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల నేత శ్రీనివాస్‌గౌడ్ చే పడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక హత్యకు కు ట్ర చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో గౌడ సం ఘం మండలాధ్యక్షుడు రాజుగౌడ్, ప్రధానకార్యదర్శి రమేశ్‌గౌడ్, సభ్యులు వెంకట్రాములుగౌడ్, మహిపాల్‌గౌడ్, అశోక్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, సంజీవగౌడ్ పాల్గొన్నారు.