మరికల్, ఆగస్టు 03: స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం.. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. అంటూ మరికల్లో స్నేహితుల దినోత్సవాన్ని (Friendship Day) ఘనంగా జరుపుకున్నారు. 2003 -04 ఎస్సెస్సీ బ్యాచుకు చెందిన స్నేహితులు ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ను కట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో స్నేహానికి మించింది ఏమీ లేదని, స్నేహం ఒక్కటే శాశ్వతమని తెలిపారు. కులాలు వేరైనా, మతాలు వేరైనా మేమంతా ఒక్కటే అని చాట్టారు. గత మధుర స్మృతులను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంగలి వేణుగోపాల్, రమేష్, మధు, జంగిడి ఆంజనేయులు, నరేష్ గౌడ్, బొందల కుంట రాజు, రాజశేఖర్ రెడ్డి, చెన్నయ్య, బాల్‌రాజ్, జంగిడి శ్రావణ్ తదితరులు ఉన్నారు.
చిన్నారుల ఆనందం..
స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మరికల్ మండల కేంద్రంలో చిన్నారులు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుని ఒకరినొకరు అభినందించుకున్నారు. చిన్నారులు తమ స్నేహానికి గుర్తుగా స్నేహితుల దినోత్సవ బ్యాండ్‌ను కట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు అక్షయ శ్రీ, నందన, అక్షర, యశ్వంత్ బహు రాయి, బంటి, శ్రీమంత్, కార్తీక్, సాహిత్ పాల్గొన్నారు.