నారాయణపేట, డిసెంబర్ 27 : జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో మం గళవారం జిల్లాలో పలు నేరాలకు పాల్పడి కేసుల్లో ఉన్న రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ అయిన వారికి హిస్టరీ షీట ర్స్ మేళా నిర్వహించారు. రౌడీ షీటర్లు చేసిన నేరాలపై కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పేర్కొన్నారు. రౌ డీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతున్నదని, భూ కబ్జా లు, సెటిల్మెంట్లలో తలదూర్చినా, అల్లర్లకు పాల్పడినా, మ హిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినా చట్ట ప్రకారం హి స్టరీ షీటర్స్ మళ్లీ ఓపెన్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు జిల్లా లో 65 మంది రౌడీ షీటర్లు, 190 మంది సస్పెక్ట్స్, ఒకరిపై కేడీ, 39 మందిపై కమ్యూనల్ సస్పెక్స్, 130 మంది పాత నేరస్తులపై హిస్టరీ షీట్స్ మెయింటెన్స్ చేస్తున్నామన్నారు. మొత్తం 438 మందిలో సత్ప్రరివర్తన, వివిధ కారణాలతో 71 మంది హిస్టరీ షీట్స్ క్లోజ్ చేసినట్లు తెలిపారు. హిస్టరీ షీట్స్ క్లోజ్ అయిన వారు ఎవరి పని వారు చేసుకుంటూ ప్రశాంతమైన జీవితం గడపాలన్నారు. భవిష్యత్తులో ఎలాం టి గొడవలకు వెళ్లకుండా సత్ప్రరివర్తనతో మెలగాలన్నారు. కార్యక్రమంలో సీఐలు శ్రీకాంత్‌రెడ్డి, సీతయ్య, జనార్దన్, ఎస్సైలు జగదీశ్వర్, సురేశ్, పర్వతాలు, నరేందర్ తదితరు లు పాల్గొన్నారు.
పారదర్శక సేవలు అందించాలి
పోలీసులు పారదర్శకమైన సేవలను అందించాలని డీసీఆర్బీ డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా పరిధిలో నవంబర్‌లో ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన వారికి కేపీఐ రివార్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభ కనబర్చిన సి బ్బంది, అధికారులను గుర్తించి ప్రోత్సహించేందుకుగానూ రివార్డులు, అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ అంకితభావంతో విధులు ని ర్వర్తించాలన్నారు. జిల్లాలో 20 మందికి కేపీఐ రివార్డ్స్ అం దజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
మెరుగైన సేవలు అందిస్తున్నాం
జిల్లాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని డీ ఎస్పీలు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు అన్నారు. డీజీ పీ మహేందర్‌రెడ్డి వీసీ నుంచి మంగళవారం నిర్వహించిన నెల వారీ సమీక్షలో వారు పాల్గొని మాట్లాడారు. కోర్టు అధికారుల సమన్వయంతో పెండింగ్ కేసుల పరిష్కారానికి కృ షి చేస్తున్నామని, పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేసి, పె ట్రోలింగ్ వాహనాల తనిఖీ, సాంకేతికతను వినియోగించుకొని దొంగతనాల నివారణ, కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. శిక్షణ నుంచి సిబ్బందికి సాంకేతికతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. షీటీ మ్స్, కళాబృందాలతో సైబర్ నేరాలు, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. సమావేశంలో సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.