నారాయణపేట టౌన్, అక్టోబర్ 1 : పర్యావరణ పరిరక్షణకు మహిళలు ఇంటి నుంచే కట్టుబడి ఉండాలని, తడి, పొడి చెత్తను ఇంటిలోనే వేరు చేసి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని కలెక్టర్ హరిచందన అన్నారు. ఆజాదీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని శీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో స్వచ్ఛ సర్వేక్షన్-హోమ్ కంపోస్టింగ్‌పై మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం అనే ది జీవితంలో భాగంగా అయిపోయిందని, అదే ప్లాస్టిక్ వ్య ర్థం భూమిలో కరిగి నాశనం కావడానికి దాదాపు 1000 ఏండ్లు పడుతుందన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు మానవుల ఆరోగ్యంతోపాటు జీవరాశుల ఆరోగ్యంపై విష పదార్థాల వలే హానికరంగా పని చేస్తున్నాయని ఆమె తెలిపారు. చెత్తను మున్సిపాలిటీకి ఇవ్వకుండా బయట పారవేయడం వల్ల మానవాళి అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం ఉందన్నా రు. ఇండ్లలో పోగు చేసిన చెత్తను ఇంటి వద్ద కు వచ్చే మున్సిపల్ ట్రాక్టర్, ఆటోల్లో వేయాలన్నారు.
వాటిని డంపింగ్ యార్డుకు తరలించి తడి, పొడి చెత్తలను వేరుచేసి అక్కడే కంపోస్టింగ్ చేసి ఎరువును తయారు చేస్తార ని వివరించారు. ప్రజలు కూడా కంపోస్టింగ్ చేసే విధానాన్ని నేర్చుకొని ఇంట్లోనే ఎరువులను తయారు చేసుకోవాలన్నారు. కాలు ష్యం అనేది పొగ ద్వారానే వస్తుందని అనుకోరాదని, చెత్తచెదారంతో కూడా ఏర్పడుతుందన్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో పాల్గొని మీ ప్రాం తంలో నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలపై అభిప్రాయాలు తెలియజేయాలన్నారు. దీనికి గానూ మొబైల్లో ఎస్ఎస్జీ సీఎఫ్ అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఆన్లై న్ ద్వారా అభిప్రాయం తెలపవచ్చన్నారు. అనంతరం మ హిళలతో జిల్లాను స్వచ్ఛగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చే యించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రరెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, కౌన్సిల ర్లు, మహిళలు పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకలు ఘనంగా చేపట్టాలి
ఈ నెల 7 నుంచి నిర్వహించే బతుకమ్మ వేడుకలను జి ల్లాలో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ హరిచందన అన్నా రు. పట్టణంలోని పురాతన బారంబావిని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ప్రతి జిల్లా, మండలకేంద్రాల్లో ప్రభుత్వం బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది బారంబావి వద్ద వేడుకలను ఏర్పాటు చేయాలని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినం సందర్భంగా పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరిచందన రక్తదా నం ప్రాముఖ్యత, ఆవశ్యకతను వివరించే వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 18 ఏం డ్లు పూర్తయి ఆరోగ్యంగా ఉన్న వారందరూ రక్తదానం చేయవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, శస్త్ర చికిత్సల సమయంలో, క్యాన్సర్ వ్యాధులు, కాన్పు సమయంలో రక్తం అవసరమవుతుందన్నారు.