నారాయణపేట టౌన్, ఆగస్టు 23 : జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని గ్రామాల్లో విజయవంతం చే యాలని కలెక్టర్ హరిచందన పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని కలెక్టరేట్ నుంచి వైద్య ఆరోగ్య, అనంబంధ శా ఖలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఆమె మాట్లాడారు. నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం ద్వారా జిల్లాలో 1 నుంచి 19 ఏండ్ల వయస్సు కలిగిన 1,61,915 మంది పిల్లలకు ఆ ల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయాలని, అందు కోసం 592 మంది ఆశ కార్యకర్తలు, 700 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్త్ వర్కర్లను, ఇతర వలంటీర్లు, సూపర్వైజర్లను కేటాయించామని పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి 31వ తేదీ వరకు చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి ఏడాది రెండుసా ర్లు నిర్వహించే కార్యక్రమాన్ని కొవిడ్ వల్ల నిర్వహించలేదని, ఈసారి కరోనా కారణంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రా లు, కళాశాలలు మూతపడడంతో విద్యార్థులంతా ఇంటి వద్ద నే ఉండడం వల్ల వైద్య ఆరోగ్య సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లి మాత్రలు పంపిణీ చేయాలన్నారు. ఒకటి నుంచి రెండేం డ్ల లోపు చిన్నారులకు సగం మాత్ర, 3 నుంచి 19 ఏండ్ల లో పు పిల్లలకు మాత్ర చొప్పున అందజేయాలన్నారు. ప్రతిరోజు ఎంత మందికి మాత్రలు వేశారో వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. 1లక్షా97వేల936 ఆల్బెండజోల్ మా త్రలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులు, మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆమె సూచించారు.
డీఎంహెచ్‌వో డాక్టర్ రామ్‌మనోహర్‌రావు మాట్లాడుతూ బహిర్భూమికి వెళ్లి చేతులు కడుక్కోకుండా భుజించడం వల్ల పిల్లలు నులిపురుగుల బారిన పడుతారని, దీంతో కడుపులో నొప్పి రావడం, సరైన సమయానికి భోజనం చేయకపోవడం, రక్తహీనతతో బాధపడుతుంటారని ఆయన చెప్పారు. ఆ పిల్లలు పాఠశాలలకు సరిగ్గా వెళ్లలేకపోవడం, చురుకుగా ఉండరన్నారు. వీటిని నివారించేందుకు నులి పురుగుల నివారణ మాత్రలు కచ్చితంగా ఇవ్వాలని ఆయన సూచించారు. మాత్రల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలకు, కొవిడ్ వచ్చిన ఇండ్లల్లో మాత్రలు ఇవ్వరాదని, వీరికి తర్వాత ఇవ్వాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఐవో శైలజ, డీఆర్డీవో గోపాల్‌నాయక్, సంక్షేమ శాఖ అధికారి వేణుగోపాల్, డీపీవో మురళి పాల్గొన్నారు.