ఊట్కూర్, ఆగస్టు 23 : శ్రావణమాసం మూడో సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను దర్శించుకున్నారు. మండలంలోని తిప్రాస్పల్లి గ్రామ శివారులో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు పరిసర గ్రామాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసర ప్రాంతంలోనే పిండి వంటలు వండి స్వామికి నైవేద్యం సమర్పించా రు. సామూహిక భోజనాలు చేశారు. భక్తులు కానుకలు స మర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వద్ద చిరువ్యాపారులు మిఠాయి, ఆట బొమ్మల దుకాణాలు వెలిశా యి. భక్తుల సందడితో మినీ జాతరను తలపించింది. మం డలంలోని నిడుగుర్తి, పులిమామిడి కొండలపై వెలిసిన లిం గేశ్వరస్వామిని ఆయా గ్రామాల ప్రజలు, భక్తులు దర్శించుకున్నారు. రాత్రి ఆలయాల వద్ద భక్తులు భజనలు చేశారు.
దైవచింతన అలవర్చుకోవాలి
ప్రతిఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని ఆదోని రఘుప్రేమ తీర్థుల అర్చకులు జగన్నాథాచారి, మురళీధరాచారి అన్నారు. పట్టణంలోని గురురాఘవేంద్రస్వామి మఠంలో ఆరాధనోత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. పూర్వారాధనలో భా గంగా అర్చకుడు నర్సింహాచారి మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి సుప్రభాతం, నిర్మాల్యం, పంచామృతాభిషే కం, పుష్పాలంకరణ, భజన, పల్లకీ సేవ, నైవేద్యం, మహా మంగళహారతి, సర్వ దర్శనం తదితర కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమం లో ప్రహ్లాదాచారి, జయతీర్థ, భీంసేన్రావు, శేషు, నర్సిం హ, రవితేజ ప్రసాద్, భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా అఖండజ్యోతుల ఊరేగింపు
పట్టణంలోని బ్రాహ్మణవాడి తొగుట వీర క్షత్రియ సం ఘం ఆధ్వర్యంలో సోమవారం అఖండజ్యోతుల ఊరేగిం పు వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతు లు పట్టగా, నందికోల ఆటలతో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అంతకుముం దు అమ్మవారి ఆలయంలో పంచామృతాభిషేకం, పసుపు, కుంకుమార్చన, పుష్పాభిషేకం, నైవేద్యం, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమి టీ సభ్యులు, మహిళలు, భక్తులు తది తరులు పాల్గొన్నారు.
ఘనంగా ఆరాధనోత్సవాలు
పట్టణంలోని బ్రాహ్మణవాడిలో వెలిసిన రా ఘవేంద్రస్వామి ఆరాధనోత్సవా లు ప్రారంభమయ్యాయి. స్వామివారి ఉత్సవాలు ఈనెల 25వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆలయ అ ర్చకులు శ్యామ్సుందర్జోషి, వెంకటేశ్చారి తెలిపారు. ఉదయం స్వామివారికి సుప్రభాతసేవ, పంచామృతాభిషేకం, అలంకరణ చేశారు. 24న మ ధ్యారాధన, 25న ఉత్తరాధన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవకు పాత్రులు కావాలని కోరారు.
పార్వతీపరమేశ్వరాలయంలో…
మండలంలోని చేగుంటలో పార్వతీపరమేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. శ్రావణమా సం సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అర్చకులు శివలింగానికి హారతి ఇచ్చారు. మహిళలు ఉపవాసంతో స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజ లు చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు తదితరు లు పాల్గొన్నారు.
బసవన్నస్వామి ఆలయంలో…
మండలంలోని భైరంకొండ సమీపంలో వెలిసిన బసవన్నస్వామి ఆలయం లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా పే ట పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తా రు. అనంతరం అక్కడే వన భోజనాలు చేసి తిరిగి తమత మ గ్రామాలకు వెళ్లిపోతారు.