నారాయణపేట, సెప్టెంబర్ 3 : గణేశ్ నిమజ్జన సమయంలో శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా జ రుపుకోవాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. పట్టణంలో ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఊట్కూర్‌లో ఈనెల 7, 8, నారాయణపేటలో 10, 11, మక్తల్‌లో 11, 12 తేదీల్లో గణేశ్ నిమజ్జన శోభాయా త్ర నిర్వహిస్తామన్నారు. వినాయకులను నిమజ్జనం చేసేందుకు జిల్లాలోని అన్ని ప్రాంతాల చెరువుల్లో నీరు పుష్కలం గా ఉందన్నారు. పేటలో కొండారెడ్డిపల్లి చెరువు వద్ద పెద్ద గణేశ్ నిమజ్జనం చేసేందుకు క్రేన్లు వినియోగించనున్నట్లు ఆయన చెప్పారు. మండపాల నిర్వాహకులు గణేశ్ విగ్రహం తీసిన 24గంటల్లో నిమజ్జనం చేయాలన్నారు. శోభాయాత్ర సమయంలో దొంగతనాల ని వారణకు, చైన్ స్నాచింగ్‌ను అరికట్టేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు ప్ర త్యేక చర్యలు తీసుకుంటున్నామన్నా రు. అందుకోసం షీ టీమ్స్, మఫ్టీలో ఉండే ఐడీ పార్టీలు ఏర్పాటు చేశామని, ముఖ్యంగా దొంగతనాలు జరుగకుం డా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.
నిమజ్జన సమయంలో బందోబస్తులో పాల్గొనేందుకు పోలీసులతోపాటు 200 మంది వ లంటీర్ల సేవలను వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని, చిన్న బాక్సుల ను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రార్థన మందిరాల వద్ద ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ఆలయాలు, మసీదులు, దర్గాల వద్ద ఉంటూ అనుచిత వ్యా ఖ్యాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఏర్పాటు చేశామని, మత విద్వేషాలు సృష్టించేలా మెసేజ్‌లు పంపే వారిపై కఠిన చ ర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించి నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు సత్యనారాయణ, వెంకటేశ్వరావు, సీఐ శ్రీకాంత్‌రెడ్డి, ఆర్ఐలు రాఘవరావు, కృష్ణయ్య, ఎస్సై సురేశ్‌గౌడ్ తదిత రులు పాల్గొన్నారు.