మరికల్ : ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అంగన్వాడీ ( Anganwadi ) మజ్దూర్ సంఘం కార్యవర్గాన్ని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూర్పు రామ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర నూతన కార్యవర్గంలో నారాయణపేట జిల్లా జాజాపూర్కు చెందిన ఉషారాణి ( Usharani ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా, మరికల్ మండలం అప్పంపల్లికి చెందిన అనితను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వరకు పోరాడుతామని తెలిపారు. అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. వీరి ఎంపిక పట్ల నారాయణపేట, మరికల్ మండలాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు హర్షం వ్యక్తం చేశారు.