నారాయణపేట, జూలై 5 : పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడం తో బంగారు తెలంగాణ తయారు చేసుకోవాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప ట్టణంలోని 5వ వార్డు సాయివిజయ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా కౌ న్సిలర్లు ఎమ్మెల్యేకు పూల మొక్కలు అందజేసి స్వాగతం ప లికారు. ఎమ్మెల్యే కలెక్టర్ హరిచందనతో కలిసి మొక్క నాటి నీళ్లుపోశారు. ప్రస్తుతం పట్టణాల కన్నా గ్రామాలు పచ్చదనంతో కనిపిస్తున్నాయన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడుగుంత లు, వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, ప్రతిఒక్క రూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. సింగారం క్రాస్ రోడ్డు నుంచి ఎర్రగుట్ట వరకు 4 లైన్ల రోడ్లు ప నులు జరుగుతున్నాయని, వీర సావర్కర్ చౌరస్తా నుం చి అంబేద్కర్ చౌరస్తా వరకు రూ.4 కోట్లతో రోడ్డు పనులు చేపడుతున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధు లు ఉదయం వేళల్లో వార్డుల్లో పర్యటించాలన్నారు. ప్రజలు కూడా జవాబుదారీతో వ్యవహరించాలన్నారు.
కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారిని నియమించామ ని, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా కృషి చేసి జిల్లాను మోడల్‌గా తయారు చేసుకోవాలన్నారు. స మావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూ య, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్, కౌ న్సిలర్లు, పట్టణ ప్రత్యేక అధికారి జైపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్‌రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.
ఆదర్శ మున్సిపాలిటీగాతయారు చేయాలి
కోస్గి, జూలై 5 : కోస్గి మున్సిపాలిటీని ఆ దర్శంగా తయారు చేయాలని కొడంగల్ ఎ మ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని 3వ వార్డు మల్‌రెడ్డిపల్లిలో పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే పాల్గొన్నా రు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వార్డులోని కాలనీలన్నీ పరిశీలించారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వా ర్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 16వ వార్డులో మున్సిపల్ స్పెషల్ అధికారి వెంకటేశ్వర్లు, ప్రత్యేకాధికారులు, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌స్వామి కాలనీల్లో పర్యటించి చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగించి కాలనీలను శుభ్రం చేయిస్తున్నా రు. అనంతరం గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ప్ర జాప్రతినిధులు పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా రు. గ్రామాల్లో కాలనీలన్నీ గ్రామ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, కౌ న్సిలర్ లక్ష్మమ్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.