మహబూబ్‌నగర్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకమైన జిల్లా క్లబ్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. క్లబ్ అధ్యక్షుడిగా సభ్యులంతా నాగేశ్వర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నా టకీయ ఉత్కంఠ పరిణామాల మధ్య జిల్లా క్లబ్ ఎన్నికలు ఊహించని మలుపు తిరిగాయి. ప ట్టణ ప్రముఖులంతా ఒక్కటై రాజకీయ జో క్యాన్ని సహించేది లేద ని కుండబద్దలు కొట్టా రు. బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు చెక్ పెట్టా రు.
శనివారం ‘డిస్ట్రిక్ట్ క్లబ్లో రాజకీయ జోక్యం’ శీర్షికన వచ్చిన ‘నమస్తే తెలంగాణ’ కథనం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హుటాహుటిన డిస్ట్రిక్ట్ క్లబ్ సీనియర్ సభ్యులంతా ఒక్కతాటిపైకి వచ్చి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అంతా కలిసి ప్రముఖ న్యాయవాది మనోహర్‌రెడ్డిని క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకునే బాధ్యతను అప్పగించారు. దీంతో సీనియర్ సభ్యులతో ఆయన సుదీర్ఘ మంతనాలు నిర్వహించారు. బాధ్యతాయుతమైన వ్యక్తిని ప్రెసిడెంట్ గా నియమిస్తే క్లబ్‌కు గౌరవం ఉంటుందని భావించి చివరకు నాగేశ్వర్‌రెడ్డి పేరును జిల్లా అధ్యక్షుడిగా ప్రతిపాదించారు. నామినేషన్ల ఘట్టం చివరి రోజు కావడంతో హంగూ ఆర్భాటాలతో కొంతమంది కాంగ్రెస్ నేతలు క్లబ్‌కు చేరుకున్నారు.
పదవి ఆశించిన కాం గ్రెస్ నేతకు సభ్యులు ఎదురు తిరగడంతో గం దరగోళం నెలకొన్నది. అవసరమైతే ఎన్నికలకు వె ళ్లాలని ఎవరి దమ్ము ఏమిటో తేల్చుకోవాలని ఆశావాహులు సవాల్ విసిరారు. డిస్ట్రిక్ట్ క్లబ్‌లోని సభ్యులంతా ఒక్కతాటిపైకి రావడంతో అధికార పార్టీ పాచికలు పారలేదు. సభ్యులపై ఒత్తిళ్లు పనిచేయకపోవడంతో ఖంగుతిని ఎక్కడ ఓటమి పాలవుతామోనని చల్లగా జారుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, మీడియాను క్లబ్ ఎన్నికల దరిదాపుల వరకు రాణియ్యలేదు. డిస్ట్రిక్ట్ క్లబ్ అధ్యక్షుడిగా నాగేశ్వర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో రాజకీయ జోక్యానికి తెరపడింది.