ఆత్మకూర్ : ఏప్రిల్ 23న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతుల 25వ పెళ్లిరోజు సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు రాయచూర్ పరమేశ్, మాజీ అధ్యక్షులు రహమతుల్లా, ఆత్మకూరు మాజీ సర్పంచ్ గంగాధర్ గౌడ్, స్థానిక నాయకులు మణి వర్ధన్ రెడ్డి, దామోదర్ తదితరులు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతుల పేరు మీద ప్రత్యేక పూజలతో పాటు అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు.
ఆలయానికి వచ్చిన భక్తులకు మిఠాయిలు పంచిపెట్టి పెళ్లిరోజు వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి ఎదిగిన తమ నాయకుడు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి త్వరలోనే మంత్రి పదవి దక్కాలని వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లుగా వారు తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూర్ టౌన్ అధ్యక్షుడు నల్లగొండ శ్రీనివాసులు, నాయకులు నాగేష్, మాజీ కౌన్సిలర్ ఎస్టీడీ శ్రీనివాసులు, వెంకట నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.