కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి యధావిధిగా బ్రహ్మోత్సవాల పూజా కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. సురభి రాజా వంశస్థులు ఆదిత్య లక్ష్మణరావు, వారి కుమారుడు స్వామికి హారతి ఇచ్చి బ్రహ్మోత్సవాల తుది ఘట్టాన్ని ప్రారంభించారు.
బ్రహ్మోత్సవాలను పునస్కరించుకొని మంగళవారం సుందరంగా అలంకరించిన శేష వాహనంపై ఊరేగింపు నిర్వహించారు. రాత్రి 7 గంటల తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సతీసమేతంగా ఆ శేష వాహనంపై ఉంచి పురవీధుల్లో తిప్పారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఓరుగంటి సంపత్ కుమార్ శర్మతో పాటు వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాలు నడుమ గోవింద నామస్మరణలతో స్వామి వారి ఊరేగింపు కన్నుల పండువగా జరింది.