Harish Rao | కాంగ్రెస్ సర్కార్ పాలనలో కరెంట్ కోతల పరిస్థితి ఎలా ఉందో తెలియజేసేలా ఇప్పటికే చాలా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతలు మైకులు పట్టుకుని మాట్లాడుతుండగా కరెంట్ పోతున్న ఘటనలు రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న సమయంలో కరెంట్ పోయిన సందర్భాన్ని మరువకముందే మరోసారి అలాంటి దృశ్యమే చోటుచేసుకుంది.
అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మాట్లాడుతుండగా సడెన్‌గా పవర్ కట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో దేవుళ్ల మీద ప్రమాణం చేసి మోసం చేసిన వీడియోలు సభా వేదికగా స్క్రీన్‌పై కార్యకర్తల ముందు ప్రదర్శిస్తున్న సమయంలో ఇలా కరెంట్ పోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ సర్కార్ ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తుందనడానికి ఇదే నిదర్శనమనడంలో ఎలాంటి సందేహం లేదు.
అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతుండగా పవర్ కట్ pic.twitter.com/qCTFW0D8RN
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2026
రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మోసం చేసిన వీడియోలు కార్యకర్తల ముందు ప్రదర్శించిన హరీష్ రావు https://t.co/oY0QWgZGbR pic.twitter.com/htGpyWqbN6
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2026