తిమ్మాజిపేట : తిమ్మాజిపేట మండలంలోని అప్పాజిపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నెమలిని చంపినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. గ్రామానికి వేరే పనిమీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు అల్లంపల్లి శివారులో నెమలిని పట్టుకొని చంపారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి వెళ్లేసరికి నెమలిని వదిలేసి పారిపోయారు.
పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన నెమలిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనపై మరో కథనం కూడా వినిపిస్తుంది. కుందేళ్ళ కోసం వలవేయగా అందులో నెమలి చిక్కి చనిపోయినట్లు స్థానికులు కొందరు చెబుతున్నారు. వివరాల కోసం పోలీసులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.