వెల్దండ, జూలై 11: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు భయపడేది లేదని పీడీఎస్‌యూ (PDSU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ నాయక్ అన్నారు. వెల్దండలో మంత్రుల పర్యటన నేపథ్యంలో పీడీఎస్‌యూ నాయకుడు సంతోష్‌ను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుందన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.