అచ్చంపేట, జూన్ 18: అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్ అన్నారు. శనివారం అచ్చంపేట పట్టణంలో టీఆర్ఎస్శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధానవీధుల గుండా బైక్‌ర్యాలీ కొనసాగింది. యువకులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సంద ర్భంగా పట్టణం నుంచి భారీగా బైక్‌లతో ర్యాలీగా నాగర్‌కర్నూల్‌కు తరలివెళ్లారు. జిన్‌కుంట కనకాల మైసమ్మ ఆలయంవద్ద వాహనాలు ఆపి పూజలు నిర్వహించారు. అనంతరం తెలకపల్లి వద్ద భోజనాలు చేసి జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా అచ్చంపేట నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో బైక్‌ర్యాలీని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసీరాం, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు. పేదలు, ఉద్యోగులు, విద్యావంతులు, రైతులు, యువకులు టీఆర్ఎస్వైపే ఉన్నారని గతానికన్నా ఈసారి పార్టీ మరింత బలంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం జరిగేవిధంగా పథకాలు అమలు చేస్తుందన్నారు. అచ్చంపేట నియోజకవర్గం అభివృద్ధ్ది కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిరంతరం శ్రమిస్తున్నారని అన్నారు.
రిజర్వాయర్లతో సస్యశ్యామలం
అచ్చంపేట ప్రాంతంలోని పొలాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉమామహేశ్వరం, చెన్నకేశవస్వామి రిజర్వాయర్లు మంజూరు చేయించారన్నారు. ఈ రెండు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తైతే అచ్చంపేట ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. తొందరలోనే సీఎం కేసీఆర్ అచ్చంపేటకు వచ్చి రిజర్వాయర్లు, వంద పడకల దవాఖాన ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలోనే రిజర్వాయర్ల పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలు సీఎం కేసీఆర్ పేదలు, రైతుల కోసం అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణ పథకాలు దేశ వ్యాప్తంగా పేదలకు అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. కేసీఆర్ తీసుకునే నిర్ణయానికి అందరూ మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దళితులను లక్షాధికారులుగా చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చాన్నారు.
అచ్చంపేటలో వంద మంది దళితులకు యూనిట్లు అందజేసి దళిత కుటుంబాలకు భరోసా కల్పించారన్నారు. చారగొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడంపై సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుకు ధన్యావాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల్లో చెరగనిముద్ర వేసుకుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్కు ఎలాంటి నష్టం ఉండదన్నారు. అచ్చంపేటలో జీబీఆర్ సైన్యం బలంగా ఉందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు పర్వతాలు, డాక్టర్ విష్ణుమూర్తి, అమీనుద్ద్దీన్, విష్ణువర్ధన్‌రెడ్డి, మన్నుపటేల్, సుంకరి నిర్మలాబాలరాజు, సోమ్లానాయక్, రమాకాంత్, శ్రీను, శివ, రమేశ్, రమేశ్‌రావు, పులిజాల రమేశ్, రాజు, కుతుబుద్ద్దీన్, వెంకటేశ్, రాకేశ్, వంశీ, శివ, సుల్తాన్, ప్రవీణ్, హుస్సేన్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.