అచ్చంపేట, మే 5: ఉద్యోగ సాధనలో అచ్చంపేట యువత జీవితాల్లో వెలుగు నింపాలనే లక్ష్యంతో ఖర్చుకు వెనుకాడకుండా ఏర్పాటు చేస్తున్న కోచింగ్‌ను ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం అచ్చంపేట కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో జీబీఆర్ చారిట్రబుల్ ట్రస్టు చైర్పర్సన్ గువ్వల అమల ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతీ, యు వకులకు ఉచితంగా అందిస్తున్న కోచింగ్ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రేరణా తరగతులకు కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం వివి ధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80వేల పైచిలుకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడం ప్రారంభించిందన్నారు.
వీటిలో అచ్చంపేట నుంచి పెద్దసంఖ్యలో నిరుద్యోగ యువ త ఉద్యోగాలు సాధించేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్ర ముఖ మేధా కోచింగ్ సెంటర్ ద్వారా ‘మీ జీవితం మా బాధ్యత’ అనే సంకల్పంతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 9 నుంచి పట్టణంలోని షామ్స్ ఫంక్షన్హాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వారానికోసారి టెస్టు ఉంటుందని, ఈ ప్రాంతంలోని యువ త జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. స్టడీ మెటీరియల్స్తోపాటు మధ్యాహ్న భోజనం ఉంటుందన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాజకీయాలు, క్రీడలు, చదువులో రాణించేందుకు నిరంతరం శ్రమిస్తున్న ట్లు చెప్పారు. అచ్చంపేట అభివృద్ధి కోసమే తమ జీవితాన్ని ఫణంగాపెట్టి రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు.
అనంతరం కలెక్టర్ ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ యువత ఏది సాధించాలన్నా ఒక కచ్చితమైన ధోరణితో ప్రయత్నం చేస్తే ల క్ష్యం సాధిస్తారన్నారు. కష్టపడి చదవిన వారికి ఫీడ్‌బ్యాక్ తె లుసుకోవడం చాలా అవసరమన్నారు. ఎస్పీ మనోహర్ మాట్లాడుతూ 95శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఉందని జిల్లాలో దాదాపు 200 పోలీస్ ఉద్యోగాల ఖాళీలు ఉన్నందున యువతీ, యు వకులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. జీబీఆర్ ట్రస్టు చైర్పర్సన్ గువ్వల అమల మాట్లాడుతూ అచ్చంపేట నిరుద్యోగ యువతకు ఉద్యోగ సాధనలో తమవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు ఈ శిక్షణ ఉచితం కావొచ్చు కానీ శిక్షణకు కొన్ని రూ.లక్షలు ట్రస్ట్ ద్వారా ఖర్చు చేస్తున్నామన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటేనే మరిన్ని శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తమకు కూడా ఉత్సాహం కల్గుతుందన్నారు.
కష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ లేదని కలెక్టర్ ఉదయ్‌కుమార్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోనే తనకు గుర్తింపు వచ్చిందన్నారు. అందరూ కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సాధించాలని తెలిపారు. అంతకుముందు జిన్‌కుంట మైసమ్మ అమ్మవారిని కలెక్టర్, ఎస్పీ దర్శించుకొని పూజలు చేశారు. ఎమ్మెల్యే దంపతులు వారిని సత్కరించారు. కార్యక్రమంలో డీటీడీవో అశోక్, ఆర్డీవో పాం డునాయక్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మ నోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, జెడ్పీటీసీలు మం త్రియా, రాంబాబు, ప్రతాప్‌రెడ్డి, మేధా కోచింగ్ సెంటర్ అ ధినేత డాక్టర్ చిరంజీవి, నాగరాజు, మున్సిపల్ వైస్‌చైర్మన్ శైలజారెడ్డి, డీపీఆర్వో సీతారాం పాల్గొన్నారు.