నాగర్‌కర్నూల్, మార్చి 28 : చిత్రభారతి ఫిలిం ఫెస్టివల్లో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు ప్రతిభ చాటాడు. పస్పుల లక్ష్మయ్య, గాయత్రి దంపతుల కుమారుడు హరిప్రసాద్ నాలుగో చిత్రభారతి ఫిలిం ఫెస్టివల్లో జాతీయస్థాయిలో రెండో స్థా నంలో నిలిచాడు. హైదరాబాద్‌లో యానిమేషన్ డిగ్రీ చదువుతున్న హరిప్రసాద్ ప్లాస్టిక్ వినియోగం, దుష్పరిణామాలను వివరిస్తూ యానిమేషన్ రూపంలో షార్ట్ ఫి లిం రూపొందించాడు. ఈ అంశంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర భూపాల్‌లో మూడ్రోజులపాటు జాతీయస్థాయిలో వివి ధ అంశాలపై సెమినార్ నిర్వహించారు. ఇందులో వం దకుపైగా లఘుచిత్రాలను ప్రదర్శించగా.. యానిమేషన్ విభాగంలో హరిప్రసాద్ రూపొందించిన షార్ట్ ఫిలింకు రెండో బహుమతి దక్కింది. ఆదివారం రాత్రి భూపాల్ లో జరిగిన కార్యక్రమంలో వావన్ కెండర్ చేతుల మీ దుగా అవార్డు, రూ.25 వేల నగదును అందుకున్నాడు. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, టీవీ నటుడు గజేంద్రచౌహాన్ హరిప్రసాద్‌ను అభినందించారు. ఇం డ్లలోని చెత్తను రోడ్డుపై పారవేయడం వల్ల కలిగే ఇబ్బందులు.., ప్లాస్టిక్ బదులు రీయూస్డ్ వస్తువులను ఉపయోగించాలని 4:44 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిలింలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందుకోసం హరిప్రసాద్ ఇంటిని, పరిసరాలను థర్మకోల్, అట్టలతో తయారు చేశాడు. వాటిని యానిమేషన్ రూపంలో నిజమే అనిపించేలా తయారుచేసి తమ కాలనీలోనే షార్ట్‌ఫిలిం రూ పొందించాడు. హరిప్రసాద్ మాట్లాడుతూ కుటుంబ స భ్యులు, కళాశాల అధ్యాపకుల సహకారంతో అవార్డు సాధించడం సంతోషంగా ఉందన్నారు.