బిజినేపల్లి, ఫిబ్రవరి 22 : విద్యార్థులు శాస్త్రీయ దృక్ప థాన్ని పెంపొందించుకోవాలని డీఈవో గోవిందరాజులు అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని మండల స్థాయి వైజ్ఞానిక ప్రతిభ పరీక్షను ఎమ్మార్సీలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పరీక్షను మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు నిర్వహించారు. విద్యార్థులను భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో భాస్కర్‌రెడ్డి, బాలయ్య, ప్రభాకర్, శేఖర్, సాంబశివ ఉన్నారు.
తిమ్మాజిపేట మండలంలో..
మండలకేంద్రంలోని ఎమ్మార్సీలో మంగళవారం విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో 6నుంచి పదోతరగతి చదువుతున్న 63మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నట్లు ఎంఈవో శ్రీనివాసులు తెలిపారు. మండలస్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిని జిల్లాస్థాయిలో ఈ నెల 25న నిర్వహించే పరీక్షకు పంపనున్నట్లు తెలిపారు.
ప్రతిభ కనబర్చిన విద్యార్థులు
సైన్స్ టాలెంట్ టెస్టుతో విద్యార్థుల ప్రతిభ వెలికితీయవచ్చని ఎంఈవో చంద్రుడు అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో మంగళవారం మండలస్థాయి సైన్స్ టాలెంట్ టెస్టు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నుంచి పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్టు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలస్థాయిలో 33మంది విద్యార్థులు పాల్గొన్నట్లు వివరించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లాస్థాయిలో నిర్వహించే సైన్స్ టాలెంట్ టెస్టులో పాల్గొంటారని తెలిపారు. ఆయనతోపాటు ప్రధానోపాధ్యాయులు బాలస్వామి పాల్గొన్నారు.
ఘనంగా మాతృభాషా దినోత్సవం
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రధానోపాధ్యాయులు వెంకటస్వామి అందజేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రావణ్‌కుమార్, ఉపాధ్యాయులు బాలయ్య, వెంకటస్వామి, రామకృష్ణారెడ్డి, శివకుమార్ తదితరులు ఉన్నారు.
పాఠశాల పరిశీలన
మండలంలోని సిర్సవాడ ప్రాథమిక పాఠశాలను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తిరుపతయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.