నాగర్కర్నూల్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగా ణ) : దళితబంధు పథకం అ మలుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చిలోగా లబ్ధిదారులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అం దించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొదట చారకొండ మం డలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల అంచనా ప్రకారం చారకొండ మండలంలో 1,247 కు టుంబాలను అర్హులుగా గుర్తించారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అధికారులు, దళితులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇదిలా ఉండగా, ప్రతి నియోజకవర్గంలో వంద మంది చొప్పున లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గత నెల చివరి వారంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఎమ్మెల్యేల సూచనతో పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని 100 మందిని గుర్తించారు. లబ్ధిదారులకు సాం ఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన స దస్సులు ఏర్పాటు చేయనున్నారు.
ఎంపిక చేసి న వారు ఏయే యూనిట్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వివరాలు సేకరించనున్నారు. ఫొ టో స్టూడియో, టెంట్ హౌస్, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, హోటళ్ల వంటి పలు వ్యాపారాలు చేసుకునేందుకు లబ్ధిదారుల ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. లబ్ధిదారులతో నూతన బ్యాంకు ఖాతాలు కూడా తెరిపించారు. దళారుల ప్రమే యం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల సాయం జమ కానున్నది. ప్రభు త్వం దళితుల అభ్యున్నతి కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, హాస్టళ్లు, గురుకులాలు, దళితకాలనీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నది. అలాగే కల్యాణలక్ష్మి, ఆసరా, రైతుబంధు, రైతుబీమావంటి పథకాల ద్వారానూ లబ్ధి చేకూరుతున్నది. అయితే, ఆర్థిక స్థితిమంతులను చే సేందుకు దళితబంధు పథకాన్ని కూడా అమలు చేస్తున్నది.
ఈ క్రమంలో మార్చిలోగా లబ్ధిదారులకు డబ్బులు అందనున్నాయి. ప్రస్తుతం ని యోజకవర్గానికి వంద మంది చొప్పున పథకం వర్తింపచేస్తున్నది. ఇది పూర్తయ్యాక దళిత కు టుంబాలందరికీ లబ్ధి కలగనున్నది. నాగర్కర్నూల్ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో దా దాపు 300 మంది లబ్ధిదారులను ఎంపిక చే శారు. కొల్లాపూర్, కల్వకుర్తి పరిధిలోని పలు మండలాలు వనపర్తి, రంగారెడ్డి జిల్లాల కింద ఉన్నాయి. దీంతో నాగర్కర్నూల్, అచ్చంపేట లో వంద మంది చొప్పున 200 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా.. కొల్లాపూర్లో 67, కల్వకుర్తిలో 38 మందిని ఎంపిక చేశారు. మిగిలిన లబ్ధిదారులు వనపర్తి, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వస్తారు. వీరికి మార్చి చివరి నా టికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ప్రభుత్వం దళితబంధు పథకం అమలుకు తీసుకుంటున్న చర్యలతో దళిత వర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.