నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ మీడియం చదువులకు కేరాఫ్ అ డ్రస్‌గా నిలుస్తున్నది. ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. 2007లో సక్సెస్ స్కూల్ పథకంలో భాగంగా ఈ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైంది. మొదట 121 మందితో బోధన చేపట్టగా.. సుశిక్షితులైన ఉపాధ్యాయులు సరిపడా లేకపోగా.. వసతులూ అంతంతే. అయినా, ఉపాధ్యాయులు ఆంగ్లంలో బోధన చేయడంతో ఉత్తీర్ణత శాతం పెరిగింది. దీంతో పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియంలో 454 మంది విద్యార్థులు ఉన్నారు. తెలుగు మీడియంలో 504 మంది విద్యార్థులున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 99 మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు.
ఈ ఏడాదే దాదాపుగా 150 మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు. వచ్చే ఏడాది ఈ సంఖ్య 200కు చేరొచ్చని ఉపాధ్యా యులు చెబుతున్నారు. తెలుగు మీడియంలో చేరే వారి సంఖ్య కంటే ఇంగ్లిష్ మీడియంలో చేరే వారి సంఖ్య పెరుగుతున్నది. ఉపాధ్యాయుల ఇంటింటి ప్రచారం, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, టెన్త్ లోనూ మంచి ఫలితాలు వస్తుండడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ స్కూల్‌పై ఆకర్షితులవుతున్నారు. దీంతో జిల్లాలోనే అత్యుత్తమంగా నిలుస్తున్నది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జె డ్పీ చైర్మన్ వంటి ప్రజాప్రతినిధులు, కలెక్టర్, డీఈవో వంటి ఉన్నతాధికారుల ప్రశంసలూ అందుకుంటున్నది. ఇక్కడ చదివిన విద్యార్థు లు చాలా మంది ఐఐఐటీ, ఇంజినీరింగ్ విద్య ను అభ్యసించారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ కొ లువులు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వచ్చే ఏడాదినుంచి ‘మన ఊరు-మన బడి’ పే రిట అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడి యం విద్య ప్రారంభించడం ఈ స్కూల్‌కు వ రంలా మారనున్నది.
మరిన్ని మౌలిక సదుపా యాలు కల్పించనున్నారు. గ్రామాల్లోనే ఆంగ్లమాధ్యమం చదువులు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. మారిన కాలానుగుణంగా పీజీ, లా, పీహెచ్డీ, ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత చదువుల్లో ప్రతిభ చూపాలన్నా.. ఐఏఎస్, ఐపీఎస్, రైల్వే, యూ పీఎస్ వంటి ఉన్నత కొలువులు సాధించాలన్నా ఆంగ్లం చదువుతోనే సాధ్యం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన లేకపోవడంతో పేద విద్యార్థులు డిగ్రీ, బీఏ, బీఈడీ వరకే ఎక్కువ శాతం పరిమితమవుతున్నారు. దీన్ని దూరం చేసి పేదలకు సైతం ఇంగ్లిష్ మీడియం, ఉన్నత కొలువులు సాధ్యం చేసేందుకు ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ని తీసుకొస్తుండడంతో పేదల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
ఆంగ్లంతోనే ఉన్నత భవిష్యత్తు..
ఇంగ్లిష్ మీడియం చదువులతో మంచి భవిష్యత్తు ఉంటుంది. తమ పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. అందుకే మా స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో 454 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. అందుకే రెండేండ్లుగా వంద శాతం ఉత్తీర్ణత సాధించాం. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా బోధనపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనఊరు-మనబడితో మౌలిక సౌకర్యాలు కల్పిస్తే దాదాపు వెయ్యి మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నది.
– కుర్మయ్య, జీహెచ్ఎం, నాగర్‌కర్నూల్ జెడ్పీ హైస్కూల్
సొంతూరిలోనే కార్పొరేట్ చదువు..
మన ఊరు-మన బడి పథకం కింద గ్రామాల్లోనే ఇంగ్లిష్ మీడియం చదువు లు ఉచితంగా అందనున్నాయి. నాగర్‌కర్నూల్ జెడ్పీ హైస్కూల్లో ఆంగ్ల బోధన మంచిగా ఉండడం తో తెలుగు మీడియం కం టే అధికంగా విద్యార్థులు చేరుతున్నారు. ఉపాధ్యాయులు కూడా మంచిగా కృషి చేస్తున్నారు. జిల్లాలో 850 ప్రభుత్వ పాఠశాలలుండగా.. ఇప్పుడు 254 స్కూళ్లల్లో ఆంగ్ల బోధన కొనసాగుతున్నది. వచ్చే ఏడాది అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం చదువులు ప్రారంభం కానున్నాయి. దీంతో సొంతూరిలోనే కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లిష్ చదువులు అందుబాటులోకి రానున్నాయి. ఉన్నత కొలువులు, పోటీ పరీక్షల్లో గ్రామీణ విద్యార్థులూ పోటీపడే పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రభుత్వ నిర్ణయం చాలా బాగున్నది.
– గోవిందరాజులు, డీఈవో, నాగర్‌కర్నూల్