కల్వకుర్తి రూరల్ జూన్ 5 : కల్వకుర్తి పట్టణంలోని కేశవ నగర్ కాలనీ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. విద్యానగర్ కేశ నగర్ కాలనీలో రూపాయలు 25 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ ప్రజల విజ్ఞప్తి మేరకు విద్యుత్ స్తంభాలు లైట్లు ఏర్పాటు చేశామని అన్నారు.
త్వరలోనే కాలనీలో సీపీ రోడ్డు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. అనంతరం కాలనీ ప్రజలు ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు, కాలనీ ప్రజలు తదితరులు ఉన్నారు.