Sand Mining | జూపల్లికి ఓట్లేసింది మా పొలాలు నాశనం చేసేందుకా..? రైతుల ఆగ్రహం.. వీడియో
Sand mining | తమ పంట పొలాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, దీంతో పొలాలు పాడవుతున్నాయని రైతులు నిలదీయగా మాకు జూపల్లి సార్ చెప్పిండు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ రైతులపై ఇసుక మాఫియా ముఠా రెచ్చిపోయింది.
Sand Mining | కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఇసుకాసురుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. మాకెవరు అడ్డు.. మమ్మల్ని ఎవరు ఆపేది అన్నట్టుగా అక్రమ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండలం తుంకుంట గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ఈ విషయం తెలుసుకుని అడ్డుపడ్డ రైతులపై జూపల్లి అనుచరులు రెచ్చిపోయారు.
తమ పంట పొలాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, దీంతో పొలాలు పాడవుతున్నాయని రైతులు నిలదీయగా మాకు జూపల్లి సార్ చెప్పిండు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ రైతులపై ఇసుక మాఫియా ముఠా రెచ్చిపోయింది. ఎవరి పొలాలు నాశనం కావాలని మీరొచ్చి ఇట్లా తవ్వకాలు చేస్తున్నరు.. అని ఓ రైతు ప్రశ్నిస్తుంటే మాకు జూపల్లి సార్ చెప్పిండు.. అంటూ ఓ అనుచరుడు వీడియో తీస్తూ చెప్పడం చూడొచ్చు. జూపల్లి మంది పొలాలు నాశనం చేయమని చెప్పిండా.. జూపల్లికి మేం ఓట్లేసింది మా పొలాలు నాశనం చేసేందుకా..? అని అని మరో రైతు ఫైర్ అయ్యాడు.
కాంగ్రెస్ సర్కార్లో మంత్రి అండతో ఇసుక అక్రమ దందా కొనసాగుతుందో ఈ వీడియో చెప్పకనే చెబుతోంది.
మంత్రి జూపల్లి అండతో అక్రమంగా ఇసుక తవ్వకాలు
అడ్డుపడ్డ రైతులపై రెచ్చిపోయిన జూపల్లి అనుచరులు
కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండలం తుంకుంట గ్రామంలో అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తున్న జూపల్లి అనుచరులు
తమ పంట పొలాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని, దీంతో పొలాలు పాడవుతున్నాయని… https://t.co/CQfhkiZLXW pic.twitter.com/dfngiFUZxE
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026
Read Also :
ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

