వెల్దండ, ఏప్రిల్ 1 : ఆలయాల వద్ద సైతం మహిళలకు రక్షణ లేకుండా పోతుందని బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు అందోజు శ్రీనివాసాచారి అన్నారు. గడిచిన శనివారం నాగర్కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో ఆంజనేయస్వామి దైవ దర్శనానికి వచ్చిన మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని మంగళవారం ఆయన డిమాండ్ చేశారు.
ఆలయాల వద్ద సైతం మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆలయాల వద్ద ప్రభుత్వం గట్టి పోలీస్ భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ఘటనపై నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ప్రత్యేక శ్రద్ధ వహించి నిందితులకు తగిన శిక్ష పడేలా చూడాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.