కొల్లాపూర్ : స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలలో గెలవాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన దొంగ హామీలను ప్రజల ముందు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా చిన్న బావి మండలం అయ్యవారిపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు శేఖర్, పద్మతో పాటు 20 మంది పార్టీ నాయకులు,పెద్దమారు గ్రామానికి చెందిన బిఎస్పి నాయకులు సైతం హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందరక్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల ముందు అలవికానీ హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అనంతరం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గ్రామస్థాయిలో ప్రజల ముందు ఉంచాలన్నారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాజీ ఎంపీపీ ఎంపీటీసీలు సర్పంచులు కార్యకర్తలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.