కొల్లాపూర్ : కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా జలకం శ్యామలని పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆమెకు అధికారికంగా బీ ఫామ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో టికెట్ కేటాయించినందుకు హర్షవర్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని, బీరం హర్షవర్ధన్ రెడ్డి సహకారంతో 18వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.