అచ్చంపేట, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర గురుకుల సెక్రెటరీ అలుగు వర్షిణి దిష్టిబొమ్మను అచ్చంపేటలో (Achampet) దళిత సంఘం నేతలు దగ్ధం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులను మరుగుదొడ్లు కడుక్కోమని చెప్పి బహిరంగంగా ప్రకటించడం ఆమె అగ్రవర్ణ భావజాల బ్రాహ్మణ ఆధిపత్య అహంకార వైఖరికి నిదర్శనమన్నారు. ఆమె మరుగుదొడ్లు కడిగే ఐఏఎస్ అయ్యిందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆమెను తొలగించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం నేతలు డిమాండ్ చేశారు. పిల్లలు భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన సెక్రటరీ అలుగు వర్షిని ఇలాగే మాట్లాడటం పేద విద్యార్థుల పట్ల ఆమెకు అంకితభావం లేదని, కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆమెను సస్పెండ్ చేయాలన్నారు.
ఎస్సీ దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆమె వైఖరికి జాతి బిడ్డల భవిష్యత్తు కోసం తొలగించాల్సిన బాధ్యత తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు పాత్కుల శ్రీశైలం, బిసముల్ల ఆనంద్, కొంకి విజయ్, మండారి పర్వతాలు, మీసాల ప్రభాకర్, మండారి ప్రభాకర్, పాతుకుల తిరుమలేష్, చిక్కుడు ఎల్ల స్వామి రాములు, కన్నం సుధాకర్, పాండు, మైబు తదితరులు పాల్గొన్నారు.