కోస్గి, అక్టోబర్ 4 : వాడవాడలా బతుకమ్మ సంబురాలు ని ర్వహించుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ శిరీష అన్నారు. సో మవారం మున్సిపల్ పరిధిలోని మాసాయిపల్లి 5వ వార్డులో బతుకమ్మ చీరెలను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీరొక్కపూలతో బతుకమ్మను తయారు చేసి మహిళలంతా వార్డుల్లో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. చీరెలను కట్టుకొని బతుకమ్మ ఆడుదామన్నారు. కార్యక్రమంలో కౌ న్సిలర్ బాలేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రాజేశ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మక్తల్ మండలంలో..
మక్తల్ రూరల్, అక్టోబర్ 4 : మండలంలోని కర్ని గ్రామ పం చాయతీ కార్యాలయ ఆవరణలో మహిళలకు బతుకమ్మ చీరెల ను సర్పంచ్ అక్రమ్, ఎంపీటీసీ రంగప్ప అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మీదేవి, రేషన్ డీలర్లు శారద, రంగప్ప, వా ర్డు సభ్యులు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మప్ప పాల్గొన్నా రు. అలాగే చిట్యాలలో సర్పంచ్ జానకి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రాంలింగప్ప, వీఆర్వో అలివేలమ్మ, కార్యదర్శి గౌతంగౌడ్ పాల్గొన్నారు.
కృష్ణ మండలంలో…
కృష్ణ, అక్టోబర్ 4 : ఆడపడుచుల ఆత్మగౌరవానికి సూచికగా బతుకమ్మ చీరెలు నిలుస్తున్నాయని ఎంపీపీ పూర్ణిమ, జెడ్పీటీసీ అంజనమ్మ అన్నారు. మండలకేంద్రంలోని హిందూపూర్, కు న్సి గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మహిళలకు చీరె లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభు త్వం బతుకమ్మ పండుగ కానుకగా చీరెలను అందిస్తుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్‌పాటిల్, పా ర్టీ ప్రధానకార్యదర్శి మోనేశ్, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివప్ప, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో…
దామరగిద్ద, అక్టోబర్ 4 : మండలంలోని లోకుర్తిలో ఎంపీపీ బక్క నర్సప్ప బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరెలు కట్టుకొని బతుకమ్మ ఆడు తూ దసరా పండుగ ఘనంగా నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్వరి, ఎంపీవో రామన్న, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో..
ధన్వాడ, అక్టోబర్ 4 : మండలంలోని కిష్టాపూర్‌లో బతుక మ్మ చీరెలను అందజేశారు. సర్పంచ్ దామోదర్‌రెడ్డి, ఎంపీటీసీ కడపయ్య, ఉపసర్పంచ్ బాలయ్యతోపాటు పలువురు పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చీరెలను పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
బతుకమ్మ చీరెల పంపిణీ
నారాయణపేట న్యూ టౌన్, అక్టోబర్ 4 : పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, వైస్ చైర్మన్ హరినారాయణ భట్టడ్ 11, 12, 13, 17, 20, 21వ వార్డుల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వి ద్యాసాగర్, ప్రధానకార్యదర్శి చెన్నారెడ్డి, కౌన్సిలర్లు అమీరొద్దీన్, వరలక్ష్మి, నారాయణమ్మ, రాఘవేంద్ర, సురేఖ, వార్డు స్పెషల్ ఆఫీసర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, నా యకులు, ప్రజలు పాల్గొన్నారు.
మాగనూర్ మండలంలో..
మాగనూర్, అక్టోబర్ 4 : మండలకేంద్రంలోని మం డల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ శ్యా మలమ్మ, జెడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి , తాసిల్దార్ తిరుపతయ్య మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. అలాగే మందిపల్లి, అడవిసత్యరం, అమ్మపల్లి, వడ్వట్, కోల్పూర్ గ్రామాల్లో సర్పంచులు, అధికారులు బతుకమ్మ చీరెలను అందజేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ ఎల్లారెడ్డి, ఏపీఎం రామలింగం పాల్గ్గొన్నారు.
ఆడపడుచులకు కానుకగా..
మక్తల్ టౌన్, అక్టోబర్ 4 : ఆడపడుచులకు కానుకగా బతుకమ్మ చీరెలను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని మార్కెట్ క మిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్ అన్నారు. మున్సిపాలిటీలోని రెండో వా ర్డులో ఆడపడుచులకు బతుకమ్మ పండుగ పురస్కరించుకొని చీ రెలను టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డితో కలిసి రా జేశ్గౌడ్ అందజేశారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యు డు శంషొద్దీన్, డైరెక్టర్ శాలం, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మద్దూర్ మండలంలో..
మద్దూర్, అక్టోబర్ 4 : ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీ రెలను గ్రామ గ్రామాన మహిళలకు ప్రజాప్రతినిధులు అం దజేశారు. మండలంలోని జాజరావ్పల్లి, గొర్లోనిబావి గ్రామా ల్లో సర్పంచులు చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పం చులు కృష్ణయ్య, రాజలక్ష్మి, ఎంపీటీసీ శ్రీనునాయక్, ఉపసర్పం చ్ సహదేవుడు తదితరులుపాల్గొన్నారు.
నారాయణపేట మండలంలో..
నారాయణపేట రూరల్, అక్టోబర్ 4 : మండలంలోని లక్ష్మీపూర్‌లో జెడ్పీటీసీ అంజలి, సర్పంచ్ రామ్మోహన్, ఎంపీటీసీ బాలమణిలతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, ఉపసర్పంచ్ బా లప్ప తదితరులు పాల్గొన్నారు.