అచ్చంపేట రూరల్, జూలై 21 : శ్రీశైల ఉత్తర ద్వారంగా బాసిళ్లుతున్న శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో జరుగు నిత్య అన్నదాన కార్యక్రమానికి కల్వకుర్తి మండలానికి చెందిన ఎం. క్రాంతికుమార్ రూ.25,116 ను విరాళంగా అందజేశారు. భార్య శిరీష, కుమారుడు ఉమామహేశ్వర్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఆయన స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయం చైర్మన్ బీరం మాధవరెడ్డి, పాలక మండలి సభ్యులు, ఆలయ కార్యనిర్వాహక అధికారి ఆర్.శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ రవికుమార్, రమేశ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.