కొల్లాపూర్ : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో గల శ్రీవారి గుండంలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోడేరు మండల కేంద్రానికి చెందిన చాకలి వెంకటయ్య (60) గత కొద్ది ఏండ్లుగా సింగోటం గ్రామంలో నివాసం ఉంటున్నాడు.
కాగా, బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఆలయానికి వెళ్లినట్లు తెలిసింది. అయితే ఆలయ ప్రాంగణంలోనే శ్రీవారి గుండంలో పడిపోవడంతో గమనించిన స్థానికులు బయటకు వెలికి తీసేలోపు మృతి చెందినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.