నాగర్‌కర్నూల్, జనవరి 31 : తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం కేసీఆర్ సారథ్యంలో అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో పరుగులు పెట్టి ప్రత్యేకత చాటుకున్నది. మంత్రులతో పోటీపడి మరి మర్రి నిధులు తెప్పించారు. దీంతో రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల ఏర్పాటుతో పట్టణ రూపురేఖలే మారాయి. ఎండబెట్ల, నాగర్‌కర్నూల్ మధ్యలో ఉన్న కేసరి సముద్రాన్ని మినీ ట్యాంక్‌బండ్‌గా ఏర్పాటు చేశారు. 2014-2023 మధ్య రూ.165.90 కోట్ల పనులతో సుందరీకరించారు. దీంతో నాగర్‌కర్నూల్ అభివృద్ధికి కాణాచిలా మారింది.
తలమానికం మినీ ట్యాంక్‌బండ్..
కేసరి సముద్రాన్ని మినీ ట్యాంక్‌బండ్ మా ర్చడంతో జిల్లా కేంద్రానికి తలమానికంగా మా రింది. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌ను తలదన్నే లా ఇక్కడ తీర్చిదిద్దారు. రూ.20 కోట్లకుపైగా నిధులతో పర్యాటకంగా అభివృద్ధి చేశారు. మర్రి ప్రత్యేక శ్రద్ధతో.. తన సొంత నిధులు రూ.45 లక్షలతో ట్యాంక్‌బండ్‌లో ఏర్పా టు చేసిన బుద్ధుడి విగ్రహం ఆకర్షణగా నిలుస్తోంది. కట్టపై పార్కు ఏర్పాటు, బతుకమ్మ ఘాట్, బతుకమ్మ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. సెలవు రోజుల్లో పిల్ల లు, పెద్దలు ఆహ్లాదంగా గడిపేందుకు ఆట, వ్యాయామ పరికరాలను ఏ ర్పాటు చేశారు. ఉదయం, సాయం త్రం వందలాదిగా వచ్చి సరదాగా గడుపుతున్నారు.
జంక్షన్లు, రోడ్ల విస్తరణతో విశాలం..
పట్టణంలో రోడ్ల విస్తరణ, విశాలమైన జంక్షన్ల ఏర్పాటు తో ప్రజలకు సౌకర్యవంతంగా మారింది. ఉయ్యాలవాడ నుంచి కొల్లాపూర్ చౌ రస్తా వరకు రోడ్డును విస్తరించి డివైడర్, సెంట్రల్ లైటింగ్ అమర్చడ ంతో జిల్జిల్ జిగేల్ మంటున్నాయి. అలాగే ఉయ్యాల వాడ, శ్రీపురం, కొల్లాపూర్ చౌరస్తాల్లో జంక్షన్లను నిర్మించి లైటింగ్ ఏర్పాటు చేశారు. 4 కి.మీ. దూ రంలోని కొల్లాపూర్ జంక్షన్లో మాజీ మంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మర్రి జనం మన్ననలు పొందారు. జెడ్పీ మైదానం, జూనియర్ కళాశాల మైదానాల్లో ఫ్లడ లైట్లను ఏర్పాటు చేశా రు. అంబేద్కర్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నల్లవెల్లి రోడ్డు విస్తరణ చేసి డివైడర్, సెంట్రల్ లైటింగ్‌తో సుందరంగా మార్చారు. రూ.65 కోట్లతో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేశారు. 24 వార్డుల్లోని అన్ని కాలనీలో వేసిన సీసీ రోడ్లు అద్దాల్లా మెరుస్తున్నాయి.
ఐకాన్‌లా మెడికల్ కాలేజీ, కలెక్టర్, ఎస్పీ ఆఫీసులు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మర్రి జనార్దన్‌రెడ్డి సార థ్యంలో ఉయ్యాలవాడ శివారు ఎన్ఎంసీ గుర్తింపులో 2022లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటైంది. అప్పట్లో ప్రభుత్వ దవాఖానలో అదనపు పడకలను పెంచుతూ 300 స్థాయికి అప్‌గ్రేడ్ చేశారు. డయాలసిస్, ఐసీయూ సెంటర్లు, ప్రత్యేక బెడ్లను ఏర్పాటు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించారు. అలాగే కలెక్టర్, ఎస్పీ కార్యాల యాలను ఐకాన్‌లా మారాయి. సువిశాల ప్రదేశంలో.. ప్రజలకు సౌకర్యవంతంగా ని ర్మించారు. పట్టణ నడిబొడ్డులో గ్రంథాలయ భవనాన్ని ఏర్పాటు చేసి పాఠకులకు సౌక ర్యవంతంగా చేశారు.
విశాలమైన మార్కెట్
ఉమ్మడి రాష్ట్రంలో వందల క్వింటాళ్లు ధాన్యం మా త్రమే నిల్వ ఉండేలా ఇరుకుగా వ్యవసాయ మార్కెట్ ఉండేది.. వర్షం వస్తే తడవకుండా ఉండేందుకు షెడ్లు ఉండేవి కావు. కానీ. తెలం గాణ హయాంలో 50 ఎకరాల విశాలం స్థలంలో రూ.1.10 కోట్లతో నిర్మించ డంతో లక్షల క్వింటాళ్ల ధాన్యం నిల్వ చేసుకునే వీలుంది. అన్ని సౌకర్యాలు ఉండడంతో రైతులు పంటలను నేరుగా మార్కెట్‌కు తీసుకొచ్చి ఆరబెట్టుకుంటున్నారు. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అలాగే మున్సి పాలిటీ భవన సముదాయం నిర్మించారు. నాగనూ లు, ఎండబెట్ల, రాంనగర్ కాలనీ రోడ్లను విస్తరించి విశాలంగా తీర్చిదిద్దారు. వీటితోపాటు వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను సైతం మర్రి ప్రారంభించి నిర్మాణం చేపట్టగా.. నేడు పనులు పూర్తి కా వచ్చాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పనులను పట్టించుకోవడం లేద న్న ఆరోపణలు ఉన్నాయి.
మేము చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది : మర్రి
నాటి సీఎం కేసీఆర్‌తో తనకున్న సంబంధా లతో అత్యధికంగా ని ధులు తెచ్చి నాగర్క ర్నూల్ను సుంద రంగా తీర్చిదిద్దాను. కేటీఆర్ ఐటీశాఖ మం త్రిగా ఉండడం.. ఆయన తో ఉన్న పరిచయాలతో మంత్రులతో సమానంగా నిధులు తెచ్చాను. కేసరి సముంద్రాన్ని మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడంతో పట్టణానికి తలమానికంగా మారింది. తన హయాంలో ట్యాంక్ బండ్‌పై జరిగిన అభివృద్ధే తప్పా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసంది జీరో. వైద్య కళాశాల కావాలని పట్టుదలతో మంజూరు చేయించాను. మున్సిపాలిటీకి వచ్చిన నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టించాం. ప్రజలకు అందుబాటులో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేశాం. తాగునీటి సమస్య తలెత్తకుండా ఇంటింటికీ మిషన్ భగీరథ కనెక్షన్ అందించాం. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశాం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోరు. నాటి పనులే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తాయి.