కొల్లాపూర్ రూరల్, జనవరి 11 : గతంలో కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చెందకుండా చేసిన వారే మళ్లీ నేడు అధికారంలో ఉండడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని..అభివృద్ధి నిరోధకులను తరిమికొట్టాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. ఆదివారం కొల్లాపూర్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే బీరం మున్సిపాలిటీ నా యకులతో కలిసి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం మా ట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాత్రమే కొల్లాపూర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు.
మున్సిపాలిటీలోని పట్టణ ప్రజల సౌకర్యార్థం నాలుగో వార్డులో పార్కును అభివృద్ధి చేసినట్లు పే ర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తిగా కుంటు పడిపోయిందన్నారు. ము న్సిపాలిటీ ప్రజలతో మాట్లాడుతుంటే వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. తాగేందుకు నీళ్లు రోజు రావడం లేదని రెండురోజులకోకసారి వస్తున్నాయని వాపోతున్నారన్నారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందని ప్రజలు చెబుతున్నారని, కరెం ట్ కూడా 24గంటలు రావడంలేదని అంటున్నారని చెప్పారు. గతంలో కొల్లాపూర్ పట్టణ అభివృద్ధి కోసం డివిజన్ స్థాయి కార్యాలయాలను తీసుకొస్తే కాంగ్రెస్ గెలిచిన వెంటనే డివిజన్ స్థాయి కార్యాలయాలు వెనక్కి పోయాయన్నారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేసింది ఏమి లేదన్నారు.
కొల్లాపూర్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే బీరం విస్తృతంగా పర్యటించగా మున్సిపాలిటీ ప్రజ లు అడుగున నీరాజనం పలికారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీరం ము న్సిపల్ ఎన్నికల ప్రచారం చేపట్టగా జనం బ్రహ్మరథం పట్టారు. పట్టణంలోని ఒకటో వార్డులో ఇంటింటికీ తిరిగి పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరా రు. అనంతరం వారాంతపు సంతలో తిరిగారు. చిరు వ్యాపారాలను ఆప్యాయంగా పలకరిస్తూ వ్యా పారా లు ఎలా ఉన్నాయని ఆరా తీశారు.
కాంగ్రెస్ ప్ర భు త్వం వచ్చిన తర్వాత పరిస్థితి బాగాలేదని వ్యా పారా లు బాగా దెబ్బతిన్నట్లు వాపోయారు. ఏ ఇం టికి వెళ్లి నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కా లేదని వాపోయారు. ఇందిరమ్మ ఇల్లు కోసం కాళ్లరిగేలా మంత్రి ఇంటికి తిరిగినా ఇవ్వలేదని శివమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పింఛ న్లు ఇవ్వలేద ని..కల్యాణలక్ష్మి కూడా ఇవ్వడం లేదని వాపోయారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్పార్టీ అభ్యర్థులను దీవించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.