అయిజ రూరల్, ఏప్రిల్ 24 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమంతో అంధత్వాన్ని నివారించవచ్చని మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న పేర్కొన్నారు. సోమవారం అయిజ పట్టణంలో 16వ వార్డులో కంటివెలుగు కార్యక్రమాన్ని విండో అధ్యక్షుడు పోతుల మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ నర్సింహులుతో కలిసి ప్రారంభించారు. అదేవిధంగా మండలంలోని చిన్నతాండ్రపాడు, కేశవరం గ్రామాల్లోనూ కంటివెలుగు శిబిరాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయాగ్రామాల ప్రజలకు కంటిపరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు అందజేశారు. కార్యక్రమం లో కౌన్సిలర్లు శశకళ, శ్రీరాములు, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, ఆంజనేయులు, హుస్సేనీ, వెంకటేశ్, వైద్యరాలు రేష్మాభానుతోపాటు వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
గద్వాల రూరల్, ఏప్రిల్ 24 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడుత కంటివెలుగు కార్యక్రమం మండలంలోని జమ్మిచేడులో కొనసాగుతున్నది. సోమవారం కంటి వెలుగుశిబిరంలో 150మంది కంటిపరీక్షలు నిర్వహిం చి 35మందికి అద్దాలు అందజేసినట్లు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఆఫియా, ఏఎన్ఎం కవిత, ఆశ కార్యకర్తలు సావిత్రమ్మ, హుస్సేనమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
మల్దకల్, ఏప్రిల్ 24 : మండలంలోని కుర్తిరావుల చెర్వు గ్రామంలో సోమవా రం కంటివెలుగు కార్యక్రమాన్ని వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న, సింగిల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డితో కలిసి ఎంపీపీ రాజారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కంటిచూపుతో ప్రజలు ఇబ్బందులు పడకుండ ఉండేందుకుగానూ ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడన్నారు. దీనిద్వారా ప్రతి గ్రామంలో డాక్టర్ల బృందం పర్యటించి గ్రామంలోని ప్రతిఒక్కరికీ కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలతోపాటు మందులు పంపిణీ చేస్తుందన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ కంటివెలుగును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుర్తి రావుల్చెర్వులో సోమవారం నుంచి ప్రారంభమై మే 5వరకు కొనసాగుతాయని వివరించారు. కార్యక్రమాన్ని ఎంపీడీవో కృష్ణ య్య, మండలకోఆప్షన్ సభ్యుడు హైదద్అలీ, బీఆర్ఎస్ మండలం అధ్యక్షుడు వెంకటన్న, నాయకులు నర్సింహారెడ్డి, ఆంజనేయులు, మహబూబ్అలీ, పెద్దపల్లి అజయ్, పటేల్ జనార్దన్‌రెడ్డి, కరుణాకర్, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
గట్టు, ఏప్రిల్ 24 : మండలంలోని ఆరగిద్ద, తారాపురంలో సోమవారం కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. రెం డు శిబిరాల్లో 448మందికి కంటి పరీక్షలు చేసి 29 మం దికి అద్దాలు పంపిణీ చేశారు. మరో 26మందికి ఆర్డర్ పెట్టా రు. కార్యక్రమంలో వైద్యులు తిమ్మప్ప, నర్సింహులు, సౌజన్యతోపాటు వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.