సొమ్మొకరిది.. సోకొకరిది..!
సొమ్మొకడిది సోకొకరిది అన్న చందాన తయారయింది కాంగ్రెస్ సర్కారు పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోనే అనేక ప్రత్యేకతలతో రూపుదిద్దుకొని.. సచివాలయాన్ని తలపించే మున్సిపల్ భవనాన్ని నిర్మిస్తే.. దాదాపు రెండేళ్ల తర్వాత శుక్రవారం ప్రారంభోత్సవం చేస్తున్నారు.
- బీఆర్ఎస్ హయాంలో జడ్చర్లకు మంజూరైన మున్సిపల్ భవనం
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చొరవతో రాష్ట్రంలోనే ప్రత్యేక డిజైన్తో నిర్మాణం
- రెండేళ్ల తర్వాత ప్రారంభోత్సవానికి ముస్తాబు
మహబూబ్నగర్, మార్చి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సొమ్మొకడిది సోకొకరిది అన్న చందాన తయారయింది కాంగ్రెస్ సర్కారు పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలోనే అనేక ప్రత్యేకతలతో రూపుదిద్దుకొని.. సచివాలయాన్ని తలపించే మున్సిపల్ భవనాన్ని నిర్మిస్తే.. దాదాపు రెండేళ్ల తర్వాత శుక్రవారం ప్రారంభోత్సవం చేస్తున్నారు. హైదరాబాద్ తరహా హైటెక్ అంగులతో అప్పటి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవ చూపి సొంతంగా దీన్ని డిజైన్ చేయించారు. ఇటు మున్సిపాలిటీకి వచ్చే ప్రజలకు.. అటు పాలకవర్గనికి .. అధికార యం త్రాంగానికి సకల సౌకర్యాలతో దీన్ని రూపొందించారు.
అక్టోబర్ 2, 2023లో రూ.3.6 కోట్ల టీఎఫ్యూడీసీ నిధులతో విశాలమైన మున్సి పల్ కొత్త భవనానికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. వెనువెంటనే భవనాన్ని శరవేగంగా రూపొందించారు. ఎన్నికలు ముగిసేనాటికి దాదాపు 80శాతం పనులు పూర్తి చేశారు. ఈ లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం.. మిగతా పనులను పూర్తి చేయడానికి దాదాపు రెండున్నర ఏళ్లు పట్టింది. చివరకు ఈ భవనాన్ని ఎలాగోలా పూర్తి చేశారు.
రాష్ట్రంలోనే ప్రత్యేకత సంకరించుకున్న మున్సిపల్ భవనాన్ని బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసి పనులు ప్రారంభిస్తే ఇవి పూర్తి చేయడానికి దాదాపు రెండున్నర ఏళ్లు పట్టడంపై జడ్చర్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఆధునిక హంగులతో నిర్మించిన ఈ ము న్సిపల్ భవనం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నది. ఇది కట్టింది జడ్చర్లలోనేనా.. అని ఆశ్చర్యపోయేలా ఉన్న భవనాన్ని కాం గ్రెస్ నేతలు ప్రారంభిస్తున్నారు. ఇది తమ హయాంలోనే కట్టినట్లు చెప్పుకోవడానికి అధికార పార్టీ నేతలు నానా తంతాలు పడుతున్నా రు. కొత్త మున్సిపల్ భవనం రూపకల్పన వెనుక మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేసిన కృషిని పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

