పిల్లలూ జాగ్రత్త
చాలాకాలం తర్వాత గవదబిళ్లల కేసులు విజృంభిస్తున్నాయి. జిల్లాలో కొద్ది రోజులుగా ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చిన్నారులకు ఈ వ్యాధి సోకుతుండడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో గవదబిళ్లలు అంటే ఏమిటి?
- వేగంగా గవదబిళ్లల కేసులు
- 15 ఏండ్లలోపు చిన్నారులపై ప్రభావం
- రెండు నుంచి నాలుగు వారాలపాటు లక్షణాలు
- సూచనలు పాటిస్తే మేలు
మద్దూర్ (కొత్తపల్లి), ఫిబ్రవరి 23 : చాలాకాలం తర్వాత గవదబిళ్లల కేసులు విజృంభిస్తున్నాయి. జిల్లాలో కొద్ది రోజులుగా ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చిన్నారులకు ఈ వ్యాధి సోకుతుండడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో గవదబిళ్లలు అంటే ఏమిటి? వాటి లక్షాణలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గవదబిళ్లలు అంటే..
ఇది మిక్సోవైరస్ పరోటెడిస్ అనే వైరస్ వల్ల వ్యాపిస్తుంది. వీటిని ‘చెంపగడ్డలు’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా 5-15 ఏండ్ల వయస్సు గల పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. చెవి ముందు, కింది దవడ భాగం వరకు విస్తరించి ఉన్న పరోటిడ్ లాలాజల గ్రంథి వాచి నొప్పిగా అనిపిస్తుంది. దీనివల్ల జ్వరం, తలనొప్పి, చెవినొప్పి మొదలవుతాయి. నోరు పూర్తిగా తెరిచి ఆహారం మింగడం కూడా కష్టమవుతుంది.
వ్యాప్తి ఇలా..
గవద బిళ్లలను మెడికల్ టెర్మినాలజీలో మామ్స్ అం టారు. మన నోట్లో పరోటిడ్ గ్రంధి వాయడం వల్ల గ వదబిళ్లలు వస్తాయి. ఇది సాధారణంగా 15 ఏండ్ల లో పు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధిగ్రస్తులు దగ్గి నా, తుమ్మినా, మాట్లాడినప్పుడు, వాంతులు అయినప్పుడు ఒకరి నుంచి ఇంకొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తిలో రెండు నుంచి నాలుగు వారాలపాటు ఈ లక్షణాలు కనిపిస్తాయి. గ వద వద్ద వాపు వచ్చే భాగంలో లాలాజలాన్ని త యారు చేసే గ్రంధులుంటాయి. దవడ ఎముక కింద ఒక జత, చెవుల సమీపంలో మరో జత, నాలుక కింది భాగంలో మరో జత ఇలా మొత్తం మూడు జతల లాలాజల గ్రంధులు ఉంటాయి. వీటిని సెల్యులరీ గ్లాండ్స్ అంటారు. చెవుల కింద ఉం డే మూడు జతల గ్రం ధులను పరోటిడ్ గ్రం ధులు అంటారు. ఈ గ్రంధులకు వైరస్ సోకినప్పుడు గవదబిళ్లలు వస్తాయి.
వ్యాధి లక్షణాలు
స్వల్పంగా జ్వరం, కొందరిలో తీవ్ర జ్వరం వస్తుంది. చెవి వెనుకభాగంలో, దవడల మూలాల చెవుల కింది భాగంలో వాపు వస్తుంది. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కీళ్లనొప్పులు, గొంతు నొప్పితోపాటు జలుబు, దగ్గు, చలి పెట్టడం, ఆహారం నమిలేటప్పుడు చెవి వద్ద నొప్పి వస్తుంది. ఈ వైరస్ సోకడం వల్ల రెండునుంచి నాలుగు వారాల పాటు ఇబ్బందిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ కారణంగా కొందరిలో మామ్స్ ఎన్ సెఫలైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. జ్వరం, దవడ నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
వ్యాధి నియంత్రణ..
వ్యాధి సోకిన వారు వారం పాటు ఐసొలేషన్లో ఉంటూ పోషకాహారం తీసుకోవాలి. మెత్తని ఆహారం, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే రెండు వారాల్లో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే మాస్క్ ధరించడం మంచిది. వ్యాధి తీవ్రతను బట్టి విశ్రాంతి అవసరం. వైద్యుల సూచన మేరకు జ్వరం, నొప్పులకు సంబంధించిన మందులు వాడాలి. ఇక పిల్లలకు ఎంఎంఆర్ (మీజిల్స్ మామ్స్, రుబెల్లా) టీకాలను ఇప్పించడం ద్వారా కొంతమేరకు గవదబిళ్లలను నియంత్రించవచ్చు. ఈ వ్యాక్సిన్ను రెండు డోసుల్లో ఇస్తారు. తొలిడోసు 9 నుంచి 12 నెలల మధ్య, రెండోది 12 నుంచి 15 నెలల మధ్య ఇస్తారు. డాక్టర్ల సూచనలు పాటించాలి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

