నవాబ్‌పేట, మే 6 : ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ ద్వారా సుమారుగా 40 వేల మం దికి ఉపాధి అవకాశాలు కల్పించామని.. ఉద్యోగాలు ఇవ్వడం తప్పా అని ఎంపీ మ న్నె శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని గురుకుంట గ్రామంలోని తన స్వగృహంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు దుబ్బాకలో వెయ్యి ఓట్లతో గెలిచి.. ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని స వాల్ విసిరారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ సమావేశంలో రఘునందన్‌రావు తనపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. మతిస్థిమితం కో ల్పోయి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారన్నారు. బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడో చెప్పాలన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నందుకా.. ఆసరా పింఛన్లు, రైతుబీమా, రైతుబంధు వంటి పథకాలు అమలు చేస్తున్నందుకా.. అని ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతులను నిలువునా ముంచి.. ఆదానీ, అంబానీలకు వత్తాసు పలుకుతున్నదన్నారు. రాష్ట్రంలో మరో పదేండ్లు టీఆర్ఎస్దే అధికారం అని స్పష్టం చేశారు. దమ్ముంటే బీజేపీ నాయకులు ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ను ఎదుర్కోవాలని హితవు పలికారు. సమావేశంలో ఎంపీపీ అనంతయ్య, విండో చైర్మన్ నర్సింహులు, నాయకులు ప్రతాప్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.