కుట్ర పూరితంగానే కవిత అరెస్ట్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కుట్రపూరితంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆరోపించారు. శనివారం మండలంలోని గురుకుంటలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- బీఆర్ఎస్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఒక్కటైన బీజేపీ, కాంగ్రెస్
- విజయ్‌మాల్యా, నీరవ్ మోదీలను ఎందుకు అరెస్ట్ చేయరు?
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి
నవాబ్‌పేట, మార్చి 16 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కుట్రపూరితంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆరోపించారు. శనివారం మండలంలోని గురుకుంటలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కుమ్మక్కై కవితను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. సుప్రీంకోర్టులో కే సు కొనసాగుతుండగానే ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించా రు. ఈనెల 19వ తేదీన విచారణ జరగాల్సి ఉండగా, అం తలోనే ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందన్నారు. ఈడీ వంటి నిఖార్సైన సంస్థను బీజేపీ ప్రభుత్వం దుర్వినియో గం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒ క్కరోజు ముందు అరెస్టు చేయడం ముమ్మాటికీ అక్రమ అరెస్టేనన్నారు. అనంతరం ఎంపీ మన్నె మాట్లాడుతూ అవినీ తి, అక్రమాలను వెలికి తీయాలనుకుంటే విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ వంటి ఆర్థిక నేరస్తులను ఎందుకు అరెస్టు చే యలేదో వివరించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చే స్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాడెమోని నర్సింహులు, వై స్ ఎంపీపీ సంతోశ్‌రెడ్డి, నాయకులు రాంప్రసాద్, నాగిరె డ్డి, లక్ష్మయ్య, ప్రతాప్, చెన్నయ్య, మధుసూదన్‌రెడ్డి, యా దయ్య, శ్రీను, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

