కొల్లాపూర్ : కొల్లాపూర్ (Kollapur ) పట్టణంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ఫ్లెక్సీ (Etela Rajendra Flexi) కలకలం సృష్టించింది.
కొల్లాపూర్‌లో స్థానిక మత్స్యకార్మికుల సంఘం శుక్రవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీవారి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, బీజేపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ మాట్లాడుతుండగా కొంతమంది యువకులు ఈటెల రాజేందర్ 2028 లో సీఎం కావాలని , కొల్లాపూర్‌కు కాబోయే బీసీ ఎమ్మెల్యే అంటూ ఫ్లెక్సీని ప్రదర్శించడంతో పాటు నినాదాలు చేయడంతో సభలో గంధగోళం నెలకొంది. వేదికపై ఉన్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులు అసహనం వ్యక్తం చేశారు .