అచ్చంపేట రూరల్ : భారత సబ్ జూనియర్ యూత్ ఏషియన్ కబడ్డీ జట్టు ( Kabaddi Team ) ప్రాబబుల్స్ కి తెలంగాణ రాష్ట్రం నల్లమల ప్రాంతం నుంచి ఎంపికైన పదర మండల కేంద్రానికి చెందిన క్రీడాకారిణి బండి నందిని యాదవ్‌ను ( Nadini Yadav ) పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ( MP DK Aruna) సన్మానించారు. బారత జట్టుకు ఎంపికకావడం అభినందనీయమని ఆమె అన్నారు.
పట్టుదల, క్రమ శిక్షణ, సాధన ఉంటే ఏ రంగాల్లోనైనా రాణించవచ్చని నందిని యాదవ్ నిరూపించారని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. జాతీయ జట్టుకు ఎంపికైన నందినికి తన పూర్తిసహాయ సహకారలుంటాయని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా క్రీడాకారిణి తండ్రి బండి శ్రీనివాస్ యాదవ్ ను సైతం ఎంపీ సన్మానించారు. ఈ కార్యక్రమం లో నల్లమల సీనియర్ అథ్లెటిక్స్ ఏడ్మ శ్రీనివాస్ పాల్గొన్నారు.