జడ్చర్లటౌన్, మే 22 : కుటుంబంలో జరిగిన చిన్నపాటి వివాదానికి క్షణికావేశంలో తల్లీకొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం జడ్చర్ల పట్టణంలోని ఇందిరానగర్కాలనీలో నివాసముంటున్న మీనాక్షి (60), ఆమె కుమారుడు రవి(26) వడ్డెర పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా రవి తాగుడుకు బానిసై అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు ఇంటికొచ్చి అడుగుతుండటంపై తల్లి మీనాక్షి మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం తల్లి, కొడుకు మధ్య గొడవ చోటుచేసుకున్నది. అప్పటికే ఇంట్లో ఉన్న గన్నెరపప్పును తల్లి మీనాక్షి క్షణికావేశంలో బెల్లంలో కలిపి తినగా కొడుకు రవి కూడా గన్నెరుపప్పును బెల్లంలో కలిపి తిన్నాడు. ఇద్దరు ఆయాసపడుతున్న విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు వెం టనే వారిద్దరిని చికిత్స నిమిత్తం జడ్చర్ల సర్కారు