చెన్నైతో ఉన్న అనుబంధం గుర్తుకొచ్చింది
‘ఈ సినిమా టైటిల్ వినగానే నేనొక్కసారిగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయాను. చెన్నైతో నాకున్న అనుబంధం, ప్రేమ గుర్తుకొచ్చింది. నిజంగా ఈ టైటిల్లో ఏదో మ్యాజిక్ ఉంది. నన్ను స్ఫూర్తిగా తీసుకొని అభిమానులు ప్రయోజకులు అయితే అంతకుమించిన ఆనందం ఉండదు.
‘ఈ సినిమా టైటిల్ వినగానే నేనొక్కసారిగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయాను. చెన్నైతో నాకున్న అనుబంధం, ప్రేమ గుర్తుకొచ్చింది. నిజంగా ఈ టైటిల్లో ఏదో మ్యాజిక్ ఉంది. నన్ను స్ఫూర్తిగా తీసుకొని అభిమానులు ప్రయోజకులు అయితే అంతకుమించిన ఆనందం ఉండదు. ఈరోజు వేదిక మీద అందరూ నా అభిమానులు ఉండటం సంతోషంగా ఉంది’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకుడు. ఎస్కేఎన్, సాయిరాజేష్ నిర్మాతలు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘ఈ చిత్ర నిర్మాత ఎస్కేఎన్ నా అభిమానిగా హైదరాబాద్‌కు వచ్చి.. సినిమాల మీద ప్రేమతో నిర్మాతగా ఎదిగారు. ఇక సాయిరాజేష్ మంచి సినిమాలు తీయడమే కాకుండా నేషనల్ అవార్డ్ పొందడం ఆనందంగా ఉంది. నిజంగా ఇలాంటి అభిమానుల్ని చూసి గర్విస్తున్నా. కిరణ్ అబ్బవరం మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు. నాలుగైదు సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు’ అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘చిరంజీవి అన్నది పేరు కాదు. అది నాకో ఎమోషన్. ఈ వేదికలో ఆయన ముందునిల్చొని మాట్లాడటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాలో నేను పోషించిన స్టీవెన్ అనే పాత్ర నా వ్యక్తిగత జీవితానికి కూడా బాగా కనెక్ట్ అయింది’ అని చెప్పారు. తన కెరీర్లోనే బెస్ట్ పాత్రను పోషించానని కథానాయిక శ్రీగౌరీప్రియ ఆనందం వ్యక్తం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

