పెబ్బేరు, జూలై 31 : పేదలకు బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేయించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వర గా పూర్తి చేయించాలని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పెబ్బేరు మండలంలోని పాతపల్లి, గుమ్మ డం గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తా ను మంత్రిగా ఉన్న సమయంలో అప్పటి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి గజ్వేల్ తరహాలో వనపర్తి నియోజకవర్గంలో అత్యధిక డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేయించానన్నారు. ఈ నేపథ్యంలోనే గుమ్మడం గ్రామానికి వంద ఇండ్లు మం జూరు కాగా వాటి పనులు చివరి దశ ఉన్నాయన్నారు.
పాతపల్లికి యాబై ఇండ్లు మంజూరు కాగా, అవి స్లాబ్ వరకు వచ్చి నిలిచిపోయాయని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందునా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిన అభివృద్ధి పనులను పూర్తి చేయించాలని తాను మంగళవారం కలెక్టర్‌ను కలిసి వి న్నవించానని చెప్పారు.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రభు త్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరా రు. అలాగే పెబ్బేరులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వనం రాములు ఏర్పా టు చేసి న తులసీరాం ట్రేడర్స్ షాపును ఆయన ప్రారంభించారు. అలాగే చెలిమిల్లలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నాగశేషి అనే కార్యకర్తను పరామర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్‌చైర్మన్ కర్రెస్వామి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు దిలీప్‌రెడ్డి, కౌన్సిలర్లు గోపిబాబు, ఎల్లారెడ్డి, నాయకులు మేకల ఎల్ల య్య, గోవిందునాయుడు, ఈశ్వర్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.