మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 23 : గ తంలో క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలంటే మ హబూబ్‌నగర్ వాసులు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చే ది. ఇప్పుడు స్థానికంగానే పరీక్షలు చేసేందుకు ప్ర భుత్వం సిద్ధమైంది. తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ పేదల పాలిట వరమవుతున్నాయి. రోగం నయం చేసుకునేందుకు అయ్యే ఖర్చు కోసం ప్రజలు భయపడుతున్న పరిస్థితుల్లో.. టీ హబ్ ద్వారా అందుతున్న సేవలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ప్రైవేట్ దవాఖానలు, ల్యాబ్‌ల్లో క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష కోసం రూ.2,500 పైనే ఖర్చవుతున్నది. విటమిన్-డి టెస్టుకు రూ.500. హిస్టోపాథాలజీ, కల్చర్ పరీక్షలకు రూ.వెయ్యి. ఇదంతా సామాన్య ప్రజలకు ఆర్థిక భారంగా మారుతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం తీపి కబురు అందించింది. మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలోని టీ హబ్‌లో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష చేయనున్నారు. ప్రస్తుతం 57 రకాల టెస్టులు చేస్తుండగా.. మార్చి నుంచి ఈ సంఖ్యను 134కు పెంచనున్నారు. దీనికి వైద్య, ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అవసరమైన యంత్రాల కొనుగోలు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. టెండర్లు పూర్తికావడంతోపాటు యంత్రాలకు టీఎస్ఎంఎస్ఐడీసీ ఆమోదించింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో డయాగ్నొస్టిక్ కేంద్రాలున్నాయి. కొత్తగా మరో 13 జిల్లాల్లో ఏర్పాటు చేయనుండగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మార్చి నాటికి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటివరకు 57 రకాల టెస్టులను పీహెచ్సీ వైద్యుల సూచనతో చేస్తున్నారు. అయితే, ఖరీదైన టెస్టులను స్పెషలిస్ట్ వైద్యుల సిఫారసుతోనే చేస్తారు. రోగనిర్ధారణ టెస్టులో వాడే రీ ఏజెంట్స్ ధర ఎక్కువగా ఉండడమే దీనికి కారణమని వైద్యవర్గాలు వెల్లడించాయి.
రాష్ట్రంలోని అన్ని టీహబ్ సెంటర్లలో 134 రకాల పరీక్షలు చేసేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే చేస్తున్న 57 రకాల పరీక్షల్లో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ), హెచ్‌బీఏ1సీ, బ్ల డ్ గ్రూప్, షుగర్, లిపిడ్ ప్రొఫైల్, డెంగీ, లివర్ ఫంక్షనింగ్ ముఖ్యమైనవి. మొదట పాథాలజీ సేవలే అందించినా.. తర్వాత రేడియాలజీ, వైరాలజీలను ప్రవేశపెట్టారు. కొత్త కేంద్రాల్లో ఈ 3 రకాల సేవలూ అందించనున్నారు. కాగా, మహబూబ్‌నగర్ జి ల్లాలో డయాగ్నొస్టిక్స్ సెంటర్‌ను 2021 జూన్‌లో ప్రారంభించారు. పీహెచ్‌సీలకు వచ్చే రోగుల నుంచి రక్త, మూత్ర నమూనాలను తీసుకొని టీ హబ్ సెం టర్కు పంపుతున్నారు. ఇప్పటివరకు 1,03,730 మంది రోగుల నుంచి 1,72,413 రక్త నమూనాలు సేకరించి, 3,21,777 వైద్య పరీక్షలు నిర్వహించి.., 19,15,283 రకాల నివేదికలు అందజేసినట్లు వైద్య అధికారులు తెలిపారు.
క్యాన్సర్, టీబీ, ఐజీఎం ఫర్ హెపటైటిస్-ఏ, ఐజీఎం ఫర్ హెపటైటిస్-ఈ, విటమిన్-డి, బోన్‌మ్యారో ఎగ్జామినేషన్, ఫంగల్ కల్చర్, బ్లడ్ యూరిన్ కల్చర్, హిస్టోపెథాలజీ, హ్యూ మన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ), హెపటైటిస్-సి (హెచ్పీసీ), హెపటైటిస్-బి (హెచ్‌పీబీ), టెస్ట్ ఫర్ డ్రగ్ ఓవర్ డోస్, వైరాలజీ న్యూక్లియర్ యాసిడ్ టెస్ట్ ఫర్ హెచ్ఐవీ, సీడీ 4 కౌం ట్, పాప్‌స్మియర్, టార్చ్ (టాక్సోప్లాస్మోసిస్, రుబెల్లా సైటోమెగాలో వైరస్, హెర్సిస్ సింపిక్స్, హెచ్ఐవీ) ప్రొలాక్టిన్, తట్టు, చికున్‌గున్యా, డిప్తీరియా, పెరిటిన్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఐ ఫ్యాక్టర్స్) వంటి ముఖ్యమైన పరీక్షలు చేయనున్నారు.