MLC Naveen Kumar | మరికల్, జూన్ 10 : మరికల్ మండలంలోని పూసలపాడు గ్రామానికి చెందిన పారిజాత అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా మంగళవారం మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి పారిజాత భర్త రాఘవులకు రూ. 19500ల విలువ చేసే చెక్కును అందజేశారు. నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారని బిఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. చెక్కును అందించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికీ, సహకరించిన మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.