కొల్లాపూర్, మార్చి 3 : కాంగ్రెస్ గూండాల చేతిలో గాయపడిన బీఆర్ఎస్ నేత రాజునాయక్ను సోమవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోన్లో పరామర్శించారు. దాడిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం మీరొచ్చారని స్వాగతం పలికేందుకు గ్రామ నుంచి ఎక్కువ మందితో రావడాన్ని జీర్ణించుకోలేని స్థానిక అధికార పార్టీ నాయకులు తాను, తన కుటుంబంపై హత్యాయత్నానికి పాల్పడ్డారని వివరించారు.
రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని వాపోయాడు. స్పందించిన కవిత రాజుకు మనోధైర్యాన్ని అందించారు. నీకు, మీ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. న్యాయ పోరాటం చేద్దాం.. పార్టీ అగ్రనాయకత్వం తోడుగా ఉంటుందన్నారు. దీంతో రాజు సంతోషం వ్యక్తం చేశాడు. బీఆర్ఎస్ లేకుండా చేయడం కాంగ్రెస్ తరం కాదని ఎమ్మెల్సీ చెప్పిన మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయని రాజు అన్నాడు.