అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్
రాష్ట్రంలో 60 లక్షల సైన్యం కలిగిన అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించిందని ఎ మ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
- ప్రతిపక్షాల మాటలు ప్రజలు నమ్మరు
- ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి
- గులాబీ పార్టీలోకి 100 మంది
వెల్దండ, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలో 60 లక్షల సైన్యం కలిగిన అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించిందని ఎ మ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం వె ల్దండ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన 100 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు హైదరాబాద్లోని ఎమ్మెల్సీ నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. మల్లయ్య, రాములు, సత్యనారాయణ, పెద్ద య్య, నూనె జంగయ్య, పర్వతాలు, అబ్బయ్య, పెంట య్య, రమేశ్, లక్ష్మమ్మ, మహిళలు పార్టీలో చేరిన వారి లో ఉన్నారు. వీరికి ఎమ్మెల్సీ కండువాలు కప్పి పార్టీలో కి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ పేదల పక్షపాతి అన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నా రు. రైతులను అక్కున చేర్చుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని ధ్వజమెత్తారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాల మాటలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. ఉనికిని చాటుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ పాకులాడుతూ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని ఆరోపించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో పేదల అభ్యున్నతికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చూపుతానని బైరాపూర్ వాసులకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

