ధర్మాపూర్ : వలసల జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు అందరి సహకారం అవసరమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గం ధర్మాపూర్లోని ఆల్ మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన సందర్భంగా జీకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేయాలి అని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న పదేండ్లలో జికె ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, సిజే బెనహర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, కళాశాల కార్యదర్శి ఇంతియాజ్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.