అలంపూర్ చౌరస్తా, డిసెంబర్ 31 : నూతన సంవత్సరంలో అలంపూర్ నియోజకవర్గంలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెంది ప్రజలందరూ బాగుండాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం అలంపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కొత్త సంవత్సరంలో ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా నడవాలన్నారు.
గ్రామాల్లో సమస్యలు లేకుండా ప్రజలందరూ అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి సంతోషాంగా ఉండాలని సూచించారు. అదేవిధం గా ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ ఎఫ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
అనంతరం అలంపూర్ నియోజకవర్గంలో మానవపాడుకు చెందిన లక్ష్మీకాంతమ్మకు రూ.10 వేలు, మద్దిలేటికి రూ.14 వేలు, వడ్డేపల్లి మండ లం రామాపురానికి చెందిన బజారమ్మకు రూ.14 వేలు, ఇటిక్యాల మండలం వావిలాల చెందిన లక్ష్మీదేవికి రూ.21వేల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీలను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బాషా, పరమేశ్వర్‌రెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవిప్రకాశ్, వెంకట్రామయ్యశెట్టితో పాటు వివిధ గ్రా మాల బాధిత కుటుంబ సభ్యు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.