ఉండవెల్లి, జూన్ 20 : మండలకేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయుడు ముఖ్యఅతిథిగా హాజరై వి ద్యార్థులకు మాత్రలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 19 ఏండ్లలోపు వారంతా ఆ ల్బెండజోల్ మాత్రలు వేసుకుంటే రక్తహీనత దరిచేరదన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.